Vrushchika Rasi Jupiter Transit Predictions 2026 - 2027

Vrushchika Rasi 9th House Impact (వృశ్చిక రాశికి 9వ స్థాన భాగ్య గురు ఫలితాలు)
అందరికీ నమస్కారంఅండి. 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ జూన్ రెండవ తేదీన ఖగోళంలో ఒక మహా అద్భుతం జరగబోతోంది. సాక్షాత్తు దేవగురువు బృహస్పతి ఏకంగా కర్కాటక రాశిలో ఉచ్చ స్థితికి చేరుకోబోతున్నాడు. ఈ మహా గురు గోచారం వల్ల కొన్ని రాశుల వారి తలరాత రాత్రికి రాత్రే మారిపోనుంది. పట్టిందల్లా బంగారమే వాళ్ళ దశ తిరగబోతోంది. మరి ఆ అదృష్ట రాశుల్లో మీ రాశి ఉందా గురుభగవానుడు మీకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. శ్రీ పరాభవనామ సంవత్సరం జూన్ 2న గురువు మిధున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం ఎక్సాల్టెడ్ స్టేట్ అనగా ఇక్కడ గురువు ఉచ్చస్థితి పొందుతాడు. సో తిరిగి ఆయన ఈ ఏడాది అక్టోబర్ 31న సింహ రాశిలోకి ప్రవేశం తిరిగి 2027 జనవరి 25న కర్కాటక రాశిలోకి ప్రవేశం ఆ తరువాత జూన్ 26, 2027 లో సింహ రాశిలోకి ప్రవేశం. ద్వాదశ రాశుల వారికి అలాగే మన ప్రపంచంలో జరగబోయే ముఖ్య సంఘటనలకు గురువు కారకత్వం వహిస్తాడు. సో ఈ వీడియోలో మీ రాశికి గురువు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అనేది సూటిగా కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా చెప్పబోతున్నాను. అలాగే వీడియో చివర్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ముఖ్య విషయాలు చెబుతాను. కావున వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 2026 జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి తొమ్మిదవ స్థానమైన భాగ్య స్థానంలో గురు గ్రహ మార్పు అనేది అంటే గురువు ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల మీ జీవితంలో అనేక ప్రయోజనాలను ప్రసాదించే భాగ్య గురు కాలంగా ఇది ఉండబోతోంది. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి YouTube లో కనిపించే ఏఏ స్క్రిప్ట్ అలాగే వ్యూస్ కోసం ఫేక్ అంచనాల్లా కాకుండా ఇది మీ రాశికి సంబంధించిన నూటికిన శాతం ఖచ్చితమైన గ్రహ సంచార విశ్లేషణ సో నేనేమి చెప్పినా నిజమే చెబుతాను అని గుర్తుపెట్టుకోగలరు. వృశ్చిక రాశి వారికి మీ రాశికి రెండు ఐదు స్థానాలకు అధిపతి అయిన గురుభగవానుడు మీ రాశికి తొమ్మిదవ స్థానానికి వస్తున్నాడు. ఇప్పటివరకు మీ రాశికి ఎనిమిదవ స్థానంలో గురువు ఉండటం వల్ల మీరు అనేక అడ్డంకులను ఎదుర్కొని ఉంటారు. మీరు జీవితంలో అనేక రకాలైన కష్టాలను అనుభవించి ఉంటారు. కొంతమంది మరణ భయాన్ని కూడా చూసి ఉండవచ్చు కాదు అంటారా అవును అయితే కామెంట్స్ లో చెప్పండి. ఆ కష్టాల నుంచి మిమ్మల్ని గట్టెక్కించడానికే భాగ్య గురువు అనుగ్రహం లభించి ఇకపై ఆ పరిస్థితులన్నీ మారబోతున్నాయి. భగవంతుని దయ వల్ల ఇకపై అంతా జయమే ఇది మీకు 12 ఏళ్ల నిరీక్షణ తరువాత వస్తున్న అద్భుతమైన యోగకాలం అండి ఇక నుంచి మీరు ఉత్సాహంగా పని చేస్తారు ఈ గురు సంచారం ద్వారా ఏ పనినైనా సాధించగలననే ఆత్మవిశ్వాసం మీ మనసులో పుడుతుంది. సవాళ్లలో విజయం సాధిస్తారు పాత వాహనాన్ని మార్పు చేస్తారు. విదేశీ సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. పాత అప్పులు తీర్చడానికి మార్గం దొరుకుతుంది. నూతన గృహము అంటే సొంత గృహాన్ని కొనుగోలు చేస్తారు. కేసులలో మంచి తీర్పు వస్తుంది. మీ దాయాదులు అంటే బంధువులతో ఉన్న ఆస్తి సమస్యలు తీరుతాయి. సంతానమునకు వివాహం నిశ్చయమవుతుంది. చేసే పనుల్లో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వృత్తిపరమైన అభివృద్ధి ఉద్యోగులకు పదోన్నతి వంటివి కలుగుతాయి. మనసుకు సంతోషం కలిగించే సంఘటనలు అనేకం జరుగుతాయి. మీరు చేసే ప్రయత్నాలన్నీ విజయాన్ని ఇస్తాయి. స్నేహితుల ద్వారా ప్రయోజనం కలుగుతుంది. కొందరికి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే యోగం కలుగుతుంది. మీ తండ్రిగారి ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది. ఏదో ఒక రూపంలో ధనరాబడి అనేది వస్తూనే ఉంటుందండి. ప్రభుత్వ సహకారం లభిస్తుంది. చిరు వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గృహిణులు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆఫీసకు వెళ్లే మహిళల ఉద్యోగం అనేది పర్మనెంట్ అవుతుంది. విద్యార్థిని విద్యార్థులు ఉన్నత విద్యలో విజయాలు సాధిస్తారు. గురువుతొమ్మిది 10 స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఈ ఉన్నత విద్య విదేశీ వ్యవహారాలకు అనుకూలిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. వ్యాపార విస్తరణకు సంతాన ప్రాప్తికి అనుకూలము రవాణ ప్లానింగ్ శిక్షణ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయ రంగంలో వారికి ఉన్నత పదవులు లభిస్తాయి పెద్దల సహకారంతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. స్పిరిచ్యువల్ గా మీరు మంత్ర సిద్ధి, ఉపాసన సాధించేందుకు ఇది అనుకూలమైన కాలం అండి. మీరు వాటిలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. మీరు ఏమి చెబితే అది జరుగుతుంది. నోటి వాక్ అంటారు కదా అలా అన్నమాట. మీరు సామాజికంగా పురోగమిస్తారు దీంతో పాటు మీ కీర్తి ప్రతిష్టలు గౌరవం ఇనుమడిస్తాయి. భవిష్యత్తులో జరగబోయేది మీకు ఒక లీలగా కనపడే ఒక మంచి అవకాశం ఒక మంచి దివ్య యోగం వంటివి తేజస్సు వంటివి మీకు కలుగుతాయి. సమాజంలో మీకున్న ఆదరణ కూడా పెరుగుతుంది. ఈ గురుగోచారం మీ జీవితంలోని సవాలను తగ్గిస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకునే మీ సామర్థ్యం బలపడుతుంది. అదే సమయం మీరు తప్పుడు పనులకు దూరంగా ఉంటారు మంచి వ్యక్తుల సహవాసాన్ని ఇష్టపడతారు ప్రయాణాలు చేయడం పట్ల మక్కువ చూపుతారు. తీర్థ యాత్రలు అంటే పుణ్యక్షేత్రాలు సందర్శనం చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. మీకు ఇష్టంఉండి సరైన ప్రయత్నాలు చేస్తే ఈ కాలంలో విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలను కూడా మీరు పొందవచ్చునండి. ఉద్యోగ రిచ్చా చూసినా ప్రైవేట్ కంపెనీల్లో పని చేసే వారికి ఇది అద్భుతమైన మంచి కాలం ఎక్కడ చూసినా మీ మాటే నెగ్గుతుంది. మిమ్మల్ని అర్థం చేసుకునే పై అధికారి బదిలిపై వస్తారు. ఇప్పటివరకు లభించని న్యాయమైన ప్రయోజనాలు ఇకపై మీకు లభిస్తాయండి. పాత జీతాల బకాయిలు కూడా వచ్చి చేరుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్ బదిలి లేదా కోరుకున్న చోటికి బదిలి అనేది లభిస్తుంది. ఉద్యోగంలో జీతం అంటే హైక్ శాలరీ హైక్ పెరుగుతుంది. పై అధికారుల పూర్తి మద్దతు సపోర్ట్ మీకు ఉంటుంది. వ్యాపార రిచ్యా చూసిన నూతన వ్యాపారం ప్రారంభించే ప్రయత్నాలు సఫలమవుతాయి. విదేశాలు లేదా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వ్యాపార సంబంధాల ద్వారా మీరు భారీ లాభాలను పొందుతారండి. హోటల్లు హెయిర్ సెలూన్లు మెడికల్ షాపులు బ్యాంకింగ్ ఉపాధ్యాయ వృత్తి రసాయనాలు ఇనుము బాస్మతి బియ్యం పూల వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు లభిస్తాయండి. ఆర్థిక రిచ్చ చూసిన ధన ప్రవాహం అనేది అంటే మనీ ఫ్లో ధారాళంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తులు లేదా వీలునామా ద్వారా అనుకోకుండా ఊహించని లాభాలు ఆస్తి యోగాలు వచ్చే అవకాశం ఈ కాలంలో గోచరిస్తున్నది. కుటుంబ జీవితం రిచ్చా చూసిన సంతాన భాగ్యం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. అలాగే మీ ఇంట్లో వివాహం వంటి శుభ కార్యక్రమాలు చాలా వైభవంగా జరుగుతాయి. తండ్రితో అనుబంధం బలపడుతుంది. ఆయన ద్వారా ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబ సమేతంగా తీర్థ యాత్ర ఫలప్రాప్తి చేసే యోగం అయితే ఉన్నదండి. గురు దృష్టి ఫలితాలు చూసిన మీ రాశికి తొమ్మిదవ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్న గురువు తన చూపుతో మీ రాశిని మూడవ స్థానాన్ని ఐదవ స్థానాలను చూస్తున్నాడు. సో గురుభగవానుడు తన ఐదవ దృష్టితో ఒకటవ స్థానమైన మీ రాశినే చూస్తున్నందున మీ శారీరక ఆరోగ్యం అనేది గతం కంటే ఎంతో బాగా మెరుగుపడుతుంది. ముఖంలో తేజస్సు మనసులో స్పష్టత కలుగుతాయి. గంధరగోళాలు అంటే కన్ఫ్యూజన్ తొలగిపోయి మీ ఆత్మవిశ్వాసం ధైర్యము పెరుగుతుంది. మీ రాశిని గురువు డైరెక్ట్ గా చూడటం వల్ల శారీరకంగా మీరు చాలా బాగుంటారు ఏ నిర్ణయమైనా మానసిక స్వస్థతతో తీసుకుంటారు. ఆశించిన ఉద్యోగ బదిలి అనేది కరారవుతుంది. పిల్లల వల్ల అంటే మీ సంతానం వల్ల మీరు గర్వపడతారు. మీ రాశికి మూడవ స్థానాన్ని గురువు చూడటం వల్ల మీ ఆలోచనలన్నీ విజయవంతం అవుతాయి. కొందరు ఉద్యోగ బదిలీపై ఇతర ప్రాంతాల్లో స్థిరపడతారు. మీ మాటల్లో చేతల్లో ధైర్యము వివేకము ఉంటాయి. భార్యా భర్తల మధ్యన అనురాగము సఖ్యత పెరుగుతుంది. మీ చిన్న తోబుట్టువుల ద్వారా మీకు లాభం కలుగుతుంది. అలాగే దీని ద్వారా చిన్న తోబుట్టువులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. మీ ఆత్మవిశ్వాసము ధైర్యము పరాక్రమం పెరుగుతాయి. మీ రాశికి ఐదవ స్థానాన్ని గురువు చూడటం వల్ల ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. పూర్వ పుణ్య స్థానాన్ని చూస్తున్నందున సంతానం ద్వారా సంతోషం కలుగుతుంది. కలలు జ్ఞాన సంబంధిత రంగాల్లో ఉన్న వారికి కీర్తి పురస్కారాలు లభిస్తాయి. చాలా కాలంగా సంతాన భాగ్యం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. మనసు ఆహ్లాదకరంగా సంతోషంగా ఉంటుంది. తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మనసుకు నచ్చిన వారు మీకు జీవిత భాగస్వామి అయ్యే అదృష్టం అనేది కలుగుతుందండి. నక్షత్రాల వారిగా ఫలితాలను చూసినట్లయితే విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారికి ఇది గురు గ్రహం యొక్క సొంత నక్షత్రం కాబట్టి ఈ గురు మార్పు మీకు రెట్టింపు ప్రయోజనాలను ఇస్తుంది. వివాహము ఇల్లు నిర్మించడం వంటి ఆగిపోయిన శుభ కార్యక్రమాలు చాలా సులభంగా జరుగుతాయి. అనుకొని ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. పిత్రార్జ్యత అస్తులలో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. మానసిక స్పష్టత కలుగుతుంది. పెద్దల ఆశీస్సులు మార్గదర్శకత్వం మీ పురోగతికి సహాయపడతాయి. అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి శని భగవానుడి నక్షత్రమైన ఇందులో జన్మించిన వారికి మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ వ్యాపార రిచ్య గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఆటంకం అనేదే ఉండదు విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు లేదా ఇతర ప్రాంతాలకు బదిలీలకు అనుకూలంగా ఉంటాయి. నూతన బాధ్యతలను స్వీకరించి సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు అనేవి విపరీతంగా పెరుగుతుంది. మిమ్మల్ని చూస్తే అందరూ చెయ్యిఎత్తి దండం పెడతారు. చాలా కాలంగా ఉన్న అలసట తొలగిపోయి శారీరక ఆరోగ్యం అనేది చాలా బలపడుతుంది. అలాగే మీకు ఆస్తులు ధన సంబంధ విషయాలలో మంచి విజయాలు లభిస్తాయి. జేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి చూసిన బుధుని నక్షత్రమైన ఇందులో జన్మించిన వారికి మేదస్సు వ్యాపార లాభాలు అనేవి అధికమవుతాయండి వ్యాపారంలో కొత్త వ్యూహాలను ఉపయోగించి భారి లాభాలను అర్జిస్తారు నూతన శాఖలను అంటే బ్రాంచెస్ ప్రారంభించడానికి ఇది అనుకూలమైన కాలము విద్యార్థులు ఉన్నత విద్యలో రాణిస్తారు విదేశీ విద్య కోసం అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇకపోతే ఈ ఏడాది డిసెంబర్ 13 నుంచి ఏప్రిల్ 13 వరకు గురువు వక్రించిన కాలంలో మీ పురోగతి చూసి అసూయ పడేవారు అధికమవుతారు. మీరు పెట్టుబడుల్లో ఏదైనా పెట్టాలనుకుంటే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇలాంటి టైంలో ఒత్తిళ్లు పెరుగుతాయి. అలాగే ఈ కాలమందు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. ఈ టైంలోనే మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే ప్రమాదం ఉంది కనుక అప్రమత్తంగా ఉండాలి. మీరు మీ తోబుట్టువులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు కానీ ఏదో ఒక విషయమై వారితో మీకు గొడవలు జరిగే అవకాశం ఉంది. ఆఫీస్ లో మీ సహుద్యోగులతో మర్యాదగా వ్యవహరించాలి. మీ సంతానానికి సంబంధించి ఒక శుభవార్తను వింటారు మీ పిల్లలు అభివృద్ధి చెందుతారు ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు మీ ప్రేమ వికసిస్తుంది భగవంతుని ఆశీస్సులు మీకు లభిస్తాయి. దీని ద్వారా మీ ప్రేమ సంబంధం సరైన దిశలో ముందుకు సాగడానికి అవకాశం లభిస్తుంది. గురువు యొక్క ఈ గోచారం విద్యార్థులకు అత్యంత శుభప్రదమైన ఫలితాలను తీసుకువస్తుంది. ఉన్నత విద్యలో గొప్ప విజయం సాధిస్తారు. విదేశాల్లో చదువుకునే అవకాశాన్ని కలిగి ఉంటారు. మీరు ఒక మంచి ప్రతిభావంతమైన విద్యార్థిగా గుర్తింపు పొందుతారు. పూర్వీకుల ఆస్తుల వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో బదిలి అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ బదిలి మీకు అనుకూలంగా మారుతుందండి. సో టోటల్ గా చూస్తే వృశ్చిక రాశి వారికి ఇదఒక స్వర్ణ యుగము తొమ్మిదవ స్థానం అదృష్టము తండ్రి పుణ్యకార్యాలు సుదూర ప్రయాణాలను సూచిస్తుంది. ఇక్కడ గురువు ఉచ్చ స్థితి పొందడం వల్ల ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలన్నీ తొలగిపోయి అదృష్ట పవనాలు మీ వైపు వీయడం ప్రారంభిస్తాయి. ఆగిపోయిన పనులు వాటంతట అవే విజయవంతంగా పూర్తవుతాయి. ఎప్పటి నుంచో మీరు ఏదైనా అనుకుంటూ అది ఆటంకాల వల్ల నిలిచిపోతూ కొంచెం స్ట్రెస్ ఫీల్ అయి ఉంటారు కదా అవన్నీ ఇప్పుడు వాటంతటి అవే పూర్తవుతాయి. భాగ్య గురువుగా వస్తున్న గురుమార్పు వల్ల వృశ్చిక రాశి వారికి కష్టాలు ముగిసి విజయ ప్రస్థానం ప్రారంభమయ్యే ఒక అద్భుతమైన సువర్ణ యుగంగా ఈ గురు సంచారం ఉండబోతోంది. మీకు జరుగుచున్న దశ అంతర్దశ భుక్తి కూడా కొంత సరి చూసుకున్న మంచిది ఆగండి ఆగండి ఇక్కడితో అయిపోలేదు అసలైన వీడియో ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అది చూసి చివరిలో మీరు చేయాల్సిన పరిహారాలు కూడా తెలుసుకోగలరు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రయాణాలు అలాగే పెట్టుబడులపై కొన్ని ముఖ్యమైన సూచనలు గురుగోచారం ఈ ఉగాది సంవత్సర ప్రారంభంలో ప్రయాణ ప్రణాళికలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి కాలసర్ప యోగం సంపూర్ణ వివరణ అనే వీడియోలో చెప్పడం జరిగింది. మీలో ఎంతమంది చూశారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ వీడియోలో అప్డేట్ చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందండి. విద్య ఉద్యోగం వ్యాపార రిత్యా చూసిన మీరు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణం చేయబోతున్నట్లయితే కొంచెం ఆలోచించి సరైన ప్రణాళికతో ముందడుగు వేయండి. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఇతర దేశాలకు వెళ్లాలనుకుంటే జాగ్రత్త అవసరం. ఉద్యోగం ఉంటేనే డబ్బు సంపాదించి కుటుంబాన్ని స్థిరపరచడానికి కదా మనం వలస వెళ్లేది. కాబట్టి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏ దేశం నుంచి ఏ దేశానికి వలస వెళ్ళినా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మీ వ్యక్తిగత జాతకంలో మంచి దశాభుక్తి నడుస్తుంటే మీ రాశి ఫలాలు బాగుండి పాజిటివ్ గా ఉంటే ఎటువంటి భయము అవసరం లేదు ఎక్కడికి వెళ్ళినా మీకు విజయం దక్కుతుంది. మీ వ్యక్తిగత జాతకంలో ఏదైనా ప్రతికూలత ఉంటే దశాభుక్తి సరిగా లేకపోతే రాహు దశ లేక శని దశ నడుస్తుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయండి. తొందరపడి ధనం పెట్టుబడిగా పెట్టి ఇరుక్కోకండి. విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవాలని ఉదాహరణకు యుఎస్ యూకే ఆస్ట్రేలియా తర దేశాలకు ప్రయాణం చేస్తుంటే నా ముఖ్యమైన సలహా ఏమిటంటే ఈసారి గురు గోచారం ఎలా జరిగిందంటే గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు ఇది బలమైన స్థానం కాదని నేను చెప్పను కానీ ఈ గురువుకి తర్వాత స్థానంలో కేతువు అనే గ్రహం ఉన్నాడు. కేతువు అంటే ఎప్పుడు మార్పు ట్రాన్స్ఫర్మేషన్ లేదా ఒకదానిని నాశనం చేసి మరొకటి సృష్టించడం ఇక్కడ గురువుకి దగ్గర అవుతున్న కేతువు వల్ల త్వరలో గురు కేతువుల కలయక జరగబోతోంది. కాబట్టి నా అభిప్రాయం ఏమిటంటే జూన్ 2026 లో లేదా ఈ సంవత్సరం మొత్తం మీ చదువు కోసం ప్రయాణం చేయబోతుంటే అనేకసార్లు ఆలోచించండి. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నట్లయితే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ వ్యక్తిగత జాతకం బాగుందో లేదో సరి చూసుకోండి. ఇది ఎవరిని నిరుత్సాహ పరచడానికి నేను చెప్పడం లేదు. చాలా మంది నెగ్లెక్ట్ చేసి నిర్లక్ష్యంగా ప్రయాణం చేసి అక్కడ స్థిరపడలేక వెనక్కి వచ్చి ఆ తరువాత లోన్ కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. పెట్టుబడుల విషయంలో మీరు కొంత డబ్బు దాచుకొని హోమ్ లోన్ కు వెళ్ళాలనో కొంచెం బంగారం కొనాలనో లేదా షేర్ మార్కెట్ లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనో అనుకుంటే కొంచెం ఓపికగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే సాధారణంగా పెట్టుబడులు పెట్టడానికి ఇదంతా సరైన సమయం కాదు. మీ వ్యక్తిగత జాతకం బాగుంటే పర్లేదండి పెట్టుబడులు అలాగే ఆర్థిక వృద్ధికి గురువే ప్రధాన కారకుడు ఉచ్చ స్థితిలో ఉన్న గురువు పక్కనే కేతువు ఉండటం వల్ల ఆదాయం ఎలా వస్తుందో పెట్టుబడులు సరైన ట్రాక్ లో వెళ్తాయో లేదో ఖచ్చితంగా చెప్పలేం కాబట్టి ఆలోచించి అడుగు అనేది ముందుకు వేయండి.
ఇదంతా ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదంటే ఇవన్నీ నేను కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే చెబుతున్నాను మీరు వ్యక్తిగతంగా ఆర్థికంగా చాలా బలంగా ఉండి మేము మీ మనీ ఫ్లో అద్భుతంగా ఉంటే వ్యాపారం చాలా బాగా సాగుతుంటే మీరు నిరభ్యంతరంగా మీ ప్లాన్స్ మీరు చేసుకోవచ్చండి కానీ బడ్జెట్ వేసుకొని ప్రణాళిక ప్రకారం జీవితాన్ని గడిపేవారు ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాల వారు మాత్రం కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలనేది నా సలహా. దయచేసి ఈ వీడియోని మీ స్నేహితులు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి ఉద్యోగం పెట్టుబడి ప్రాపర్టీ లేదా కనీసం వాహనం కొనే ప్లాన్ అయినా ఉంటుంది. ఏదేమైనప్పటికీ భారీగా ధనాన్ని పెట్టుబడిగా పెట్టి లాక్ చేయవద్దు. పెద్ద పెద్ద లోన్లు తీసుకోకుండా సేఫ్ జోన్ లో ఉండటం మంచిదని మాత్రమే నా అభిప్రాయం. అలాగే కాల సర్ప దోష ప్రభావం దీని గురించి నేను ఇప్పటికే చెప్పాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యల్లో రాహు కేతువుల మధ్య అన్ని గ్రహాలు ఉండటం వల్ల జూలై వరకు కాలసర్ప దోష ప్రభావం ఉంటుందండి. జూలై వరకు కొంచెం గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆ తరువాత ఆగస్టు మాసంలో 17వ తేదీన సూర్యుడు తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశించాక లోక కాలమాన పరిస్థితుల్లో మార్పులు అనేవి చూడవచ్చును. కాబట్టి దేనికి ఓపిక కోల్పోకుండా మీ కనీస అవసరాలు ఏమిటో వాటికి మాత్రమే ప్లాన్ చేసుకోండి. అంతేకానీ పరిమితికి మించి అడుగులు వేయడం లేదా పెద్ద మొత్తంలో రిస్కులు తీసుకునే విషయాలకి దూరంగా ఉండటం మంచిదన్నది నా సంపూర్ణ అభిప్రాయ0. మీకు ఎలాంటి పరిహారాలు అవసరం లేదు కానీ మీ దశ అంతర్దశ భుక్తిని బట్టి గురువారాల్లో పసుపు రంగు దుస్తులు ధరించవచ్చు పసుపు రంగు పూలతో గురుభగవానున్ని పూజించవచ్చు నిరుపేద వృద్ధులకు లేదా ఆధ్యాత్మిక పెద్దలకు వస్త్రదానం చేయడం వల్ల మీకు ఎంతో తో పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా ఆదివారం నాడు రాహుకాల సమయాన పరమేశ్వరుని మారేడు దలాలు అంటే బెల్వ పత్రాలతో అర్చన చేసి పూజించండి. మీరు అనుకున్నదంతా అనుకున్నట్లు జరుగుతుంది మీకు సదా మంచే జరుగుతుంది. కాకులు పక్షులు కుక్కలు గోవులకు నీరు ఆహారాన్ని అందించండి. లేని వారికి పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువల్ల పుణ్యము సత్కర్మలు అనేవి మీకు తప్పక సంప్రాప్తిస్తాయి. ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును శుభం సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లైతే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్యూ ఫర్ వాచింగ్.

Comments