- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
మీనరాశి స్త్రీ పురుషులకు జూన్ మాసంలో పంచమంలో రాశ్యాధిపతి గురు మార్పు అత్యంత శుభకరం అండి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది అప్పులను తీర్చివేస్తారు. మంచి మాటలతో అందరినీ గెలుస్తారు. ఆత్మవిశ్వాసం కనబరుస్తారు. గత సమస్యలు మబ్బు వీడినట్లు విడిపోవుట, మనశశాంతి కలుగును, ప్రశాంతత లభించును, భాగస్వామ్య వ్యాపారం పర్వాలేదు అనిపిస్తుంది. వ్యాపార అభివృద్ధికి బంధువుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు సంతృప్తిని కలిగిస్తాయి. మిత్రుల ప్రోత్సాహం లభించును సినీ కళాకారులు సైన్స్ శాస్త్రవేత్తల కృషికి తగిన ఫలితం పొందుతారు. జీవిత భాగస్వామి అలాగే సంతానం వల్ల సుఖ సంతోషాలు చేకూరుతాయి.
గ్రహగతుల రిచ్చ చూసిన లగ్నంలో శని 12వ ఇంట రాహువు వల్ల కెరీర్లో పని ఒత్తిడి పై అధికారుల నుంచి గుర్తింపు లోపించడం లేదా ఉద్యోగపరమైన ఆటంకాలు అనేవి ఎదురవుతాయి. వ్యాపారస్తులు పోటీదారుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రహస్య వ్యతిరేకత అలాగే స్వల్ప నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున భాగస్వామ్య వ్యాపారాల్లో అత్యంత జాగ్రత్త అవసరం ఆర్థిక పరంగా పంచమ స్థానంలో గురు గ్రహం అలాగే ద్వితీయ తృతీయ స్థానాల్లో కుజగ్రహ అనుకూలత వల్ల జూన్ 15 తరువాత ధన ప్రవాహం అనేది మెరుగ్గా ఉంటుందండి. అయితే రాహువు వల్ల అనుకోని ఖర్చులు రావచ్చును కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యము.
విద్యార్థులకు లగ్న శని వల్ల ఏకాగ్రత కాస్త లోపించినప్పటికీ పంచమ స్థానంలో ఉన్న గురు భగవానుడి శుభ ప్రభావం వల్ల చదువులో అద్భుతంగా రాణించి మీ లక్ష్యాలను చేరుకునే అద్భుతమైన అవకాశం మీకు లభిస్తుంది. ప్రేమ అలాగే వైవాహిక జీవితం విషయానికి వస్తే పంచమస్థానంలో శుక్ర గురు గ్రహాల సంచారం వల్ల గత అపార్థాలు తొలగిపోయి బంధంలో ఆనందం పెరుగుతుంది. ముఖ్యంగా జూన్ 15 తర్వాత ప్రేమ వివాహాలకు లేదా పెళ్లి సంబంధాలకు ఇది చాలా అనుకూలమైన సమయమండి. కుటుంబ జీవితంలో శని రాహువుల ప్రభావంతో రోత మాటల వల్ల మనస్పర్ధలు అనవసరమైన టెన్షన్స్ తలెత్తిన ఆరవ ఇంట్లో ఉన్న కేతువు వాటిని ధైర్యంగా అధిగమించే శక్తిని ప్రసాదిస్తాడు.
ఆరోగ్యపరంగా గురు సూర్యుల అనుగ్రహంతో శారీరక దృఢత్వం బాగున్నను రాహు శనుల వల్ల కాళ్ళ నొప్పులు తొడల వద్ద ఇబ్బంది అలాగే జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చును. సో టైం ప్రకారం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. కాబట్టి నేను ఇచ్చే సలహా ఈ మాసంలో ఏలినాటి శని వ్యయ రాహువుల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి అనవసర వివాదాలకు కోపానికి దూరంగా ఉంటూ ఓర్పు వహించాలి. క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ ఇష్ట దైవ ఆరాధనతో ముందుకు సాగితే ఆటంకాలను సులభంగా దాటగలరు. కావున ప్రతిరోజు ఓం నమఃశివాయ మంత్రం 108 సార్లు చదువుతూ మంగళవారం నాడు శ్రీ ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించిన మీకు సర్వదా శ్రేయస్కరం శుభప్రదం.
Comments
Post a Comment