జూన్ 2026: కుంభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? 🤔 | Kumbha Rasi June 2026

కుంభరాశి స్త్రీ పురుషులకు జూన్ మాసంలో సష్టమంలో గురు మార్పు ఆకస్మిక ధనలాభంతో అప్పులను తీరుస్తారు. రావల్సిన మొండి బకాయిలు వసూలవుతాయి. అన్నింటా మీదే పైచేయి గత సమస్యల నుంచి బయటకు వస్తారు. స్థలాలు కొనాలి అనే ఆశ మీ మనసులో చిగురుస్తుంది. గృహ నిర్మాణం చేపడతారు. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపార లాభాదేవీలు సవ్యంగా సాగుతాయి. ముఖ్యమైన విషయాల్లో విఘ్ఞుల సలహాలు పాటిస్తారు. దైవభక్తి అధికమవుతుంది. గ్రహగతుల రిచ్చ చూసిన ద్వితీయంలో ఉన్న శని లగ్నంలో రాహువు సప్తమంలో కేతువు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఒత్తిడి అభద్రత భావం అదనపు బాధ్యతలు మీ పోటీదారుల నుంచి సవాళ్లు ఎదురవుతాయి. అయితే సష్టమ స్థానంలో ఉన్న గురు గ్రహం యొక్క శుభ దృష్టి మీ రాశిపై పడటం వల్ల మీరు ఈ అడ్డంకులను దీటుగా ఎదుర్కొని ఉద్యోగ వ్యాపారాల్లో చక్కగా నిలదొక్కుకుంటారు. ఆర్థిక పరంగా ద్వితీయం శని ప్రభావంతో ధన ప్రవాహం కొంత నెమ్మదిస్తుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ధనం పొదుపు చేయడం కష్టంగా మారుతుంది. కాబట్టి ఆర్థికపరమైన నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. ఈ రాశి విద్యార్థులకు రాహు కేతువుల కారణంగా మనసు చెదిరి ఏకాగ్రత లోపించే అవకాశం ఉన్నప్పటికీ గురు భగవానుడి అనుగ్రహం మీ స్వయం కృషితో చదువుపై మరింత శ్రద్ధ పెడితే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.
ప్రేమ, కుటుంబం వైవాహిక జీవిత విషయాలకు వస్తే శని రాహు కేతువుల ప్రతికూల స్థానాల వల్ల బంధాల్లో కొంత అసంతృప్తి కుటుంబ సభ్యులు అలాగే జీవిత భాగస్వామి మధ్యన చిన్నపాటి వాగ్వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నది. కాబట్టి మీ ప్రియమైన వారితో మాట్లాడేటప్పుడు సంయమనం రాజీ ధోరణి పాటించడం చాలా అవసరం అండి. ఆరోగ్యపరంగా ఈ మాసం మానసిక ఒత్తిడి కళ్ళ సమస్యలు జీర్ణకోస ఇబ్బందులు లేదా కీళ్ల నొప్పులు మిమ్మల్ని కొంత బాధిస్తాయి. కాబట్టి నేను ఇచ్చే సలహా శని మరియు ఇతర గ్రహాల ప్రతికూల ప్రభావాలను అధిగమించడానికి యోగ ధ్యానం లేదా ఇష్ట దైవ ఆరాధన మీ ధనచర్యలో తప్పనిసరిగా చేర్చుకోండి. కుటుంబ సభ్యులతో ఓపికగా వ్యవహరిస్తూ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ముందుకు సాగాలి. కావున ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం 11 సార్లు పటించండి. శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసి ఆకుల మాలను సమర్పించిన మీకు సర్వదా శ్రేయస్కరం శుభప్రదం.

Comments