జూన్ 2026: మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? 🤔 | Makara Rasi June 2026

మకర రాశి స్త్రీ పురుషులకు జూన్ మాసంలో సరికొత్త అధ్యాయం ఆరంభం సప్తమ స్థానంలో ఉచ్చ గురువు మార్పు అత్యంత మంచి పురోగతి ఆనందం మంచి ఆరోగ్యం సంపదలో పెరుగుదల కాలంండి ప్రయత్న సాఫల్యత మీ బంధువులు కుటుంబ సభ్యులు స్నేహితులు ఈ రాశి వారి విలువను గుర్తిస్తారు మంచి గౌరవము ఇస్తారు. గొప్ప వ్యక్తులతో పరిచయం ఉద్యోగంలో పదోన్నతులు వ్యాపారపరంగా మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. తోబుట్టువల సహాయంతో శుభ కార్యక్రమ నిర్వహణ చేపడతారు. గ్రహగతుల రిచ్చా చూసిన ద్వితీయంలో రాహువు అష్టమంలో కేతువు సప్తమ స్థానంలో బుధ శుక్రులు సవాళ్లు విసురుతుండగా తృతీయంలో ఉన్న శక్తివంతమైన శని మీకు రక్షణ కవచంలా నిలుస్తున్నాడు. కెరీర్ పరంగా శని అనుగ్రహంతో మీరు అద్భుతమైన ప్రగతిని సాధిస్తారు. మీ కష్టానికి తగిన గుర్తింపు, ప్రమోషన్లు, విశేష ప్రయోజనాలు లభిస్తాయి. అయితే వ్యాపారంలో గురువు ప్రభావం వల్ల లాభాలు వచ్చినా ఆశించిన స్థాయిలో సంతృప్తి ఉండకపోవచ్చు. ఆటంకాలను ఎదుర్కొన్న తర్వాతే విజయం దక్కుతుంది. ఆర్థిక రిచ్చా పెరుగుతున్న ఖర్చులు కుటుంబ బాధ్యతల వల్ల ఆర్థిక భారం పడి అప్పులు చేయాల్సిన పరిస్థితి రావచ్చును. కానీ శని మీకు డబ్బును సంపాదించే అవకాశాలను కల్పిస్తూ కొంత ఉపశమనము ఇస్తాడు. ప్రస్తుతం మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నదో కామెంట్స్ లో చెప్పండి. విద్యపరంగా చూస్తే రాహు కేతువులు ప్రతికూల సంచారం వల్ల విద్యార్థులకు ఏకాగ్రత లోపించడం చదువులో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. కానీ శని ఇస్తున్న ధైర్యంతో పట్టుదలతో కష్టపడి చదివితేనే ఉన్నత విద్య అలాగే పరీక్షల్లో సానుకూల ఫలితాలు సాధించగలరు.
ప్రేమ జీవితం విషయానికి వస్తే సప్తమ గురుని వల్ల భాగస్వామితో వాదనలు అపార్థాలు తలెత్తుతాయి కాబట్టి కొత్తగా ప్రేమ వివాహాలు చేసుకోవడానికి లేదా ప్రపోజ్ చేయడానికి ఈ మాసం ఏమాత్రం అనుకూలం కాదు. కుటుంబ జీవితంలో రాహు కేతువుల ప్రతికూలత వల్ల అనవసరమైన వాదనలు కుటుంబ సభ్యులతో విభేదాలు అలాగే ఆస్తి లేదా చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ధైర్యస్థానంలో రహస్యాధిపతి శని సంచారం వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినా చివరకు పరిస్థితులు సద్దుమనిగి గృహమున ప్రశాంత వాతావరణం నెలకొంటుంది వైవాహిక జీవితంలో కూడా ఆశించిన అనుకూలత ఉండదండి కాబట్టి జీవిత భాగస్వామితో వాదనలకు దిగకుండా సర్దుకు పోవడం చాలా అవసర. ఆరోగ్యపరంగా నరాల నొప్పులు చేలమండ భుజాల నొప్పులు మిమ్మల్ని ఆందోళనకు గురి చేయవచ్చు. కానీ శని మిమ్మల్ని దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి రక్షిస్తూ త్వరగా కోలుకునే శక్తిని ఇస్తాడు. స్పెషల్ అడ్వైస్ ఏమిటంటే ఈ మాసంలో సన్నిహిత మిత్రుల రూపంలో ఉన్న రహస్య శత్రువుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. పనిభారం అధికమవుతుంది అలసట బాధ్యతలు పెరుగుతాయి. కాబట్టి క్రమం తప్పకుండా యోగా ధ్యానం చేస్తూ ప్రతికూల పరిస్థితుల్లో ఓపికగా వ్యవహరించడం ద్వారా ఈ నెలలో సవాళ్లను మీరు ధైర్యంగా జయించవచ్చు కాబట్టి శనివారం నాడు శనేశ్వరుడి దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి వికలాంగులకు అన్నదానం చేసిన మీకు సర్వదా శ్రేయస్కరం శుభప్రదం.

Comments