జూన్ 2026: ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది? 🤔 | Dhanassu Rasi June 2026

ధనస్సు రాశి స్త్రీ పురుషులకు జూన్ మాసంలో తృతీయ రాహువు వల్ల ఆకాశాన్న అంటే శుభవార్త వింటారు ధనాదాయం ఉన్నది బాకీలు వసూలవుతాయి అప్పులు తీరుస్తారు సౌకర్యవంతమైన నివాసం సొంత ఇల్లు కొనే అవకాశం క్రమేపి ఇబ్బందులు తొలగును సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల కలయక మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలు యదావిధిగా సాగిపోతాయి. గ్రహగతుల రిచ్యా చూసిన శని రాహువుల సంచారం అత్యంత అనుకూలంగా ఉండి అపారమైన ధైర్యాన్ని ఇస్తుండగా అష్టమ స్థానంలో గురుమార్పు నవమంలో కేతువు ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నారు. కెరీర్ పరంగా శని అనుగ్రహం వల్ల మీరు అద్భుతమైన ప్రగతిని సాధిస్తారండి. ప్రమోషన్లు, విదేశీ ప్రాజెక్టులు, పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారంలో మీ పోటీదారులను దీటుగా ఎదుర్కొని భారీ లాభాలను గడిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు కూడా అద్భుతంగా కలిసి వస్తాయి. అయితే ఆర్థికంగా అష్టమ గురువు ప్రభావం వల్ల ఊహించని ఖర్చులు అప్పులు చేయాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు. పొదుపు కష్టమైనప్పటికీ రాహువు అనుకూలతతో ధనమును రాబట్టే ప్రయత్నాలు అయితే చేస్తారు. ప్రస్తుతం మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నదో కామెంట్స్ లో చెప్పండి. విద్యపరంగా చూస్తే నవమ కేతువు అష్టమ గురిని వల్ల ఏకాగ్రత లోపించడం చదువులో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. కానీ శని బలం ఉంది కాబట్టి నిరంతరం కష్టపడి చదివితే విదేశీ విద్యా ప్రయత్నాల్లో అలాగే పోటీ పరీక్షల్లో విజయం సాధించగలరండి.
ప్రేమ జీవితం విషయానికి వస్తే అష్టమ గురుని ప్రతికూలత వల్ల భాగస్వామితో సరైన అవగాహన లోపించి మనస్పర్ధలు తలెత్తవచ్చు. కొత్తగా ప్రేమలో పడటానికి ఇది అనుకూల సమయం కాదు కుటుంబ జీవితంలో కూడా సర్దుబాటు లేకపోవడం వల్ల వాగ్వాదాలు పెరిగి ఆనందం లోపించే అవకాశం ఉన్నది. అలాగే వివాహ జీవితంలో కూడా బంధాన్ని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి రావచ్చును కాబట్టి కొత్త వివాహ ప్రయత్నాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా గురువు అలాగే కేతువు వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి జలుబు గొంతు ఇన్ఫెక్షన్ ఉబకాయం మానసిక ఒత్తిడి ఎదురవుతాయి అయితే శని బలం మిమ్మల్ని దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కాపాడుతుంది. స్పెషల్ అడ్వైస్ ఏమిటంటే ఈ మాసంలో ఆర్థిక లావాదేవిల్లో అత్యంత జాగ్రత్త వహించండి దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది మీరంటే నచ్చని వ్యక్తులు మీకు ఇబ్బందులను కలిగిస్తారు కావున ఒక కన్ను వారిపై ఉంచండి. కుటుంబ సభ్యులతో అహంకారం విడిచి ఓపికగా వ్యవహరించండి క్రమం తప్పకుండా సమయానికి భోజనం చేస్తూ మీ కష్టాన్ని నమ్ముకుంటే ఈ మాసంలో ఎదురయ్యే ఆటంకాలను ధైర్యంగా జయించవచ్చు. కావున ప్రతిరోజు కాలభైరవాష్టకం చదవండి గురువారం నాడు గురు దక్షిణామూర్తికి అభిషేకం చేపించిన మీకు సర్వదా శ్రేయస్కరం శుభప్రదం.

Comments