- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
వృశ్చిక రాశి స్త్రీ పురుషులకు జూన్ నెలలో మీ జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభంవుతుంది. గురువు మీ భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది మీకు ఊహించి శుభ ఫలితాలను అందించబోతోంది. దశమంలో కేతువు వల్ల వృత్తిపరమైన ఆధ్యాత్మిక బలం లభించినప్పటికీ మీకు బయట కన్నా లోపలే ఎక్కువ మంది శత్రువులు ఉన్నారని తప్పకుండా గుర్తించండి. పంచమంలో శని సంచారం కారణంగా ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడి ఆశించిన గుర్తింపు రాకపోవడం లేదా మెరుగైన అవకాశాల కోసం ఉద్యోగ మార్పు వంటి సవాళ్లు ఎదురవుతాయి. వ్యాపారస్తులు లాభాల కోసం తమ వ్యూహాలను నైపుణ్యాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే భాగ్యస్థానంలో గురువు బలమైన అనుగ్రహం వల్ల పెట్టుబడులు కలిసి వచ్చి ఆర్థిక ప్రవాహం అద్భుతంగా ఉంటుందండి. ప్రస్తుతం మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నదో కామెంట్స్ లో చెప్పండి. స్పెక్యులేషన్ ద్వారా ఆకస్మిక ధనలాభం ఉన్నా చతుర్థంలో రాహువు పంచమంలో శని వల్ల ఊహించని కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యము. ఇక విద్యార్థుల విషయానికి వస్తే చతుర్థ రాహువు పంచమ శని ప్రభావం వల్ల ప్రాథమిక విద్యలో ఆటంకాలు డిస్ట్రాక్షన్స్ ఏకాగ్రత లోపించడం జరుగుతుంది. కానీ భాగ్య గురువు అనుగ్రహం వల్ల ఉన్నత విద్యను అభ్యసించే వారికి అద్భుతమైన జ్ఞాన వృద్ధి సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి.
భాగ్యస్థానంలో ఉన్న గురువు శుభ దృష్టి వల్ల మీ ప్రేమ వ్యవహారాలు అలాగే వైవాహిక జీవితం అత్యంత అన్యోన్యంగా ఆనందమయంగా సాగుతాయి. అవివాహితులకు మంచి మనసున్న భావోద్వేగ వ్యక్తి జీవితంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రద్ధగా గమనించండి అనుకోని చోట మంచి బంధం ఏర్పడవచ్చు జీవిత భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరగడం బంధువులతో సత్సంబంధాలు మెరుగుపడడం జరుగుతుంది. కానీ పంచమంలో శని చతుర్థ రాహువుల కారణంగా పిల్లల అభివృద్ధిపై ఆందోళన ఆస్తి వివాదాలు లేదా కుటుంబంలో స్వల్ప కలతలు తలెత్తవచ్చు. మాస ద్వితీయార్థంలో కుటుంబంలో ప్రశాంతత వస్తుంది.
ఆరోగ్యపరంగా గురు దృష్టి మీలో ఆత్మవిశ్వాసాన్ని ఉత్సాహాన్ని పెంచినప్పటికీ రాహు శనుల ప్రతికూల ప్రభావం వల్ల నిద్రలేమి జీర్ణ సంబంధ సమస్యలు కాళ్ళ నొప్పులు బాధిస్తాయి. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. స్పెషల్ అడ్వైస్ ఏమిటంటే వృత్తిపరమైన సవాలను మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ఇష్ట దైవ ఆరాధన ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి. పంతం పట్టే మొండి స్వభావం మీకు నష్టం కలిగిస్తుందని గ్రహించి దాన్ని వదులుకోవడానికి ప్రయత్నించాలి. కష్టానికి తగిన ఫలితం తప్పక లభిస్తుంది. వెనుకకు తిరిగి చూడకండి ధైర్యంగా ముందడుగు వేయండి. అలాగే అనవసరపు ఖర్చులను నియంత్రించుకుంటూ ఆహార నియమాలు పాటిస్తూ ఒత్తిడి దరిచేరనివ్వక ప్రశాంతంగా ఉండండి. కావున శనివారం నాడు కుక్కలకు ఆహారం నీరు అందించి శనీశ్వరుడి దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించిన మీకు సర్వదా శ్రేయస్కరం శుభప్రదం
Comments
Post a Comment