జూన్ 2026: తులా రాశి వారికి ఎలా వుండబోతుంది..? | Thula Rasi June 2026

తులా రాశి స్త్రీ పురుషులకు 2026 జూన్ మాసంలో గ్రహగతుల రిచ్చ చూసిన 10వ ఇంట ఉచ్చ స్థితిలో ఉన్న గురువు ఆరవ ఇంట్లోని శనిని వీక్షించడం వల్ల శత్రు బాధలు అడ్డంకులు తొలగిపోతాయి జ్ఞానము అవగాహన పెరుగుతాయి ఆనందము మంచి ఆలోచనలు కలుగుట యుక్తితో వ్యవహరించుట కార్యసిద్ధి కలుగుతుంది. జూన్ 9 వరకు తొమ్మిదవ ఇంట్లో బుధ శుక్రుల కలియక ఒక రాజయోగాన్ని ఇస్తుందండి. అలాగే సప్తమంలో ఉన్న కుజుడు మీకు విశేషమైన ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. కెరీర్ పరంగా చూసిన ఉద్యోగ రిచ్చా పర్వాలేదు అనిపిస్తుంది బాధ్యతలు పెరుగుతాయి. అయితే దశమంలో గురు సంచారం వల్ల మీ పదవి అధికారాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఉద్యోగంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప ఉద్యోగం మారే రిస్క్ చేయకండి. వ్యాపార రిచ్యా చూసిన నూతన వ్యాపార ప్రయత్నములకు అనుకూలం క్రయ విక్రయముల వలన లాభములు రావాల్సిన బాకీలు సకాలంలో వస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే తొందరపడి నూతన పెట్టుబడులు పెట్టడం లేదా వ్యాపార విస్తరణ వంటివి చేయకండి. ఆర్థిక వ్యవహారాల్లో నెమ్మదిగా సురక్షితంగా వ్యవహరించడం ఉత్తమం. విద్యపరంగా చూస్తే విద్యార్థులు విదేశీ విద్య లేదా ఎడ్యుకేషన్ లోన్ల కోసం ప్రయత్నిస్తుంటే తల్లిదండ్రులు లేదా మార్గదర్శకుల సలహాతో సరైన ప్రణాళికతో ముందుకు సాగాలి. ఈ కాలంలో మీ విజయానికి అదనపు శ్రమ చాలా అవసరంండి.
ప్రేమ కుటుంబం వైవాహిక జీవిత పరంగా చూసిన ప్రేమ వివాహ ప్రయత్నాలకు ఈ మాసం 50% మాత్రమే అనుకూలంగా ఉంది. కాబట్టి చేసుకోబోయే భాగస్వామి జాతక బలాన్ని కూడా పరిశీలించిన తర్వాతే ముందడుగు వేయండి. వివాహ ప్రయత్నాలు వేగం పుంచుకుంటాయి. కుటుంబ జీవితం చూసిన ఎటువంటి పెద్ద ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాధారణ స్థితిలో ఆనందంగానే సాగుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే అష్టమంలో సూర్యుడుఏడు ఎనిమిది స్థానాల్లో కుజుడి ప్రభావం వల్ల శరీరంలో ఉష్ణం పెరగడం అధిక ఒత్తిడి కోపం లేదా హైపర్టెన్షన్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి అనవసర వాదనలకు దూరంగా ఉంటూ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. సో స్పెషల్ అడ్వైస్ ఏమిటంటే ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఆచి తూచి మాట్లాడండి ఎప్పుడు మెలకవుగా ఉండండి ఈ మాసంలో నూతన అంచనాలు భార్య ఆశల వెంట పరిగెత్తకుండా భగవంతుడు మీకు ప్రసాదించిన ప్రస్తుత జీవితాన్ని సంతోషంగా స్వీకరించండి. ఉన్నదాన్ని సురక్షితంగా కాపాడుకుంటూ ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఓపికగా అడుగులు వేస్తే ఈ మాసం మీరు చాలా సులభంగా విజయవంతంగా అధిగమించవచ్చు. కావున ప్రతిరోజు శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవండి శుక్రవారం నాడు అమ్మవారి ఆలయంలో రాహుకాల సమయాన అమ్మవారికి అర్చన అభిషేకం చెప్పించిన మీకు సర్వదా శ్రేయస్కరం శుభప్రదం.

Post a Comment

Previous Post Next Post