జూన్ 2026: కన్య రాశి వారికి అద్భుతమైన కాలం | Kanya Rasi June 2026

కన్యారాశి స్త్రీ పురుషులకు 2026 జూన్ నెల అత్యంత అదృష్టాన్ని ఇచ్చే సమయం మీ రాశి నుంచి 11వ ఇంట్లో లాభస్థానంలో గురువు ఉండటం జూన్ 9న శుక్రుడు జూన్ 23న రాశ్యాధిపతి బుధుడు కూడా అదే స్థానంలో గురువుతో కలవడం వల్ల అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. సౌగంధభరితమైన జీవన విధానము ఊహించిన దానికన్నా ఎక్కువగా లాభాలే పొందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఓ తీయని కబురు మీ మనసును ఆనందంతో నింపేస్తుంది. మీ ప్రత్యర్దులపై మీదే పైచేయి అవుతుంది. కెరీర్ వ్యాపారం ఆర్థిక పరంగా వృత్తి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు ప్రమోషన్లు లేదా మీ కెరీర్ దశను మార్చే కొత్త మార్గాలు ఏర్పడతాయండి. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టే వారికి ఇది లాభదాయకమైన కాలము వ్యాపారం ప్రగతి బాటలో సాగుతుంది. వడ్డీ వ్యాపారస్తులకు బాకీలు వసూలవుతాయి. గతంలో ఆగిన పనులు వేగవంతం అవుతాయి. ఆర్థిక రిచ్చ ఇల్లు వాహనాలు లేదా ఆస్తులు కొనుగోలు చేయడానికి ఆర్థిక స్థిరత్వం సాధించడానికి ఇది అద్భుతమైన మాసంగా చెప్పాలి. విద్యపరంగా చూస్తే విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే కలలు నెరవేరుతాయి. చదువులో విశేష రాణింపు ఉంటుందండి. ప్రేమ కుటుంబం వైవాహిక జీవిత పరంగా సప్తమ స్థానంలో ఉన్న శని వల్ల గతంలో మీరు ఎదుర్కొన్న అడ్డంకులు వేదనలు ఇప్పుడు శనిపై పడుతున్న గురు దృష్టి వల్ల పూర్తిగా తొలగిపోతాయి అడ్డంకులు వస్తాయి వాటిని గురువు బద్దల కొడతాడు ప్రేమ వ్యవహారాల్లో మీరు కోరుకున్న వ్యక్తితో వివాహం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కుటుంబంలో సంతోషం మహిళలకు శుభ పరిణామాలు సానుకూలమైన స్థాన చలనం ద్వారా లాభాలు చేకూరుతాయి. వైవాహిక జీవిత పరంగా ఆనందమయంగా ఉంటుందండి. కలత్ర సౌఖ్యము భార్య నుంచి ఆస్తి సంక్రమించే అవకాశం అతిథి మర్యాదలు బాగుంటాయి. ఆరోగ్యపరంగా చూస్తే గురు దృష్టి మీకు శ్రీరామరక్ష దీర్ఘకాలిక అనారోగ్యాలు రుగ్మతలు అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది. అయితే సప్తమంలో శని అష్టమంలో కుజుడు ఉండటం వల్ల బంధువులతో చిన్నపాటి వాగ్వాదం స్వల్ప శారీరక ఇబ్బందులు తలెత్తవచ్చు కానీ అంతిమ విజయం మీదే సో స్పెషల్ అడ్వైస్ ఏమిటంటే గ్రహాలన్నీ మీకు అద్భుతంగా సహకరిస్తున్న ఈ జూన్ మాసంలో మీ ప్రయత్నాలను రెట్టింపు చేయండి. ఇతరుల వ్యతిరేక మాటలను లేదా చిన్న చిన్న విమర్శలను పట్టించుకోకుండా మీ లక్ష్యాలపైనే దృష్టి పెట్టండి దానధర్మాలు ఆలయ సేవలు చేయడం ద్వారా ఈ అదృష్ట కాలాన్ని మరింత ఆనందమయంగా మార్చుకోండి. మీ జాతకంలో దశాభుక్తులు కూడా అనుకూలిస్తే ఈ మాసం మీకు ఒక అద్భుతమైన రాజయోగమే అవుతుంది. కావున ప్రతిరోజు కాలభైరవాష్టకం చదవండి మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అర్చన అభిషేకం చేపించిన మీకు సర్వదా శ్రేయస్కరం శుభప్రదం.

Comments