జూన్ 2026: సింహ రాశి వారికి ఎలా ఉండబోతోంది..? | Simha Rasi June 2026

సింహరాశి స్త్రీ పురుషులకు 2026 జూన్ మాసంలో రాశ్యాధిపతి సూర్య భగవానుడు దశమ ఏకాదశ స్థానాల్లో సంచారం ఫలితంగా అనేక మార్గాలలో ఆకస్మిక ధనలాభం చేయువృత్తి వ్యాపారాలలో ప్రశంసలు నూతన వ్యక్తులు మేధావులు మీ జీవితంలో ప్రవేశిస్తారు. నూతన వస్తువులు విలువైన ఆభరణాలు కొంటారు. క్రియేటివ్ మైండ్ తో సృజనాత్మకత కొత్త ఆలోచనలతో కొత్త ధనం ఏర్పరుస్తారు. గ్రహస్థితులను గమనిస్తే 12వ ఇంట గురువు ఎనిమిదిలో శని ఒకటిఏడు స్థానాల్లో రాహు కేతువులు ఉండటం వల్ల ఇది కొంత సవాలుతో కూడిన సమయం అయినప్పటికీ శనిపై పడుతున్న గురు దృష్టి వల్ల మీ కష్టాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. కెరీర్ వ్యాపారం ఆర్థిక పరంగా వృత్తి స్థానాధిపతి అయిన శుక్రుడు 12వ ఇంట గురుడితో కలవడం వల్ల ఇది కొంత సర్దుకుపోయే సమయం తోటి ఉద్యోగులు మీతో బాగానే ఉన్నా ఉన్నత అధికారులతో మీకు అభిప్రాయ భేదం ఏర్పడవచ్చు. ఉద్యోగంలో మీరు ఆశించిన ప్యాకేజ్ లేదా హోదా రాకపోయినా వ్యాపారంలో లాభాలు సామాన్యంగా ఉన్నా ఆర్థిక విషయాల్లో కాస్త రాజీపడి ముందుకు సాగిన పరిస్థితులు మీకు అనుకూలంగానే ఉంటాయి. విద్యపరంగా చూస్తే విద్యార్థులు ఒకే కాలేజ్ లేదా ఒకే దేశంపై ఆధారపడకుండా రెండు మూడు ఆప్షన్లు సిద్ధంగా ఉంచుకోవాలి. మీరు ఆశించిన పనులు కొంత ఆలస్యంగా లేదా సగమే జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఓర్పు సహనం చాలా అవసరం. ప్రేమ కుటుంబం వైవాహిక జీవిత పరంగా చూసిన ఈ విషయాల్లో మీరు చాలా అప్రమతంగా ఉండాలండి అష్టమ శని ప్రభావం వల్ల ప్రేమ వ్యవహారాలకు కొత్త బంధాలకు ఇది అనుకూలమైన సమయం కాదు ఇవి దీర్ఘకాలం నిలిచే అవకాశాలు తక్కువ సమస్యలు తీసుకురావచ్చును కుటుంబ జీవితంలో కొంత నిరాశ పోరాటాలు ఎదురుకావచ్చు వివాహం చేసుకోవా నుకునే వారు కేవలం గోచారంపై ఆధారపడకుండా వ్యక్తిగత జాతకంలో లగ్నము రాశి నక్షత్రం దశాభుక్తులను శున్నంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. సంతానం కోసం ప్రయత్నించేవారు భార్య ఖర్చులతో కూడిన వైద్యాలకు కాకుండా సాధారణ చికిత్సలకు పరిమితం కావడం మంచిది. ఆరోగ్యపరంగా గురువు శుభదృష్టి శనిపై పడుతున్నందున ఆరోగ్యపరంగా మీకు అద్భుతమైన ఉపశమనం లభిస్తుంది. గతంలో మిమ్మల్ని వేధించిన శారీరక మానసిక రుగ్మతలు అవమానాల నుంచి బయటపడి ప్రశాంతత పొందుతారు. ఈ మాసంలో కుజుడు మీకు అత్యంత బలాన్ని ధైర్యాన్ని ఇస్తాడండి. స్పెషల్ అడ్వైస్ ఏమిటంటే ఈ మాసంలో మీకు రాశ్యాధిపతి సూర్యుడు మాత్రమే అనుకూలిస్తాడు కాబట్టి అదృష్టం కన్నా మీ శ్రమ బుద్ధి బలమే మిమ్మల్ని కాపాడతాయి మాటలో దురుస్తనాన్ని కాఠిన్యాన్ని తగ్గించండి ఏ విషయంలోనూ వేగంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి వివేకంతో ఆలోచించి అనుభవజ్ఞుల సలహా తీసుకుంటూ దైవ ప్రార్థనతో ముందుకు సాగితే ఈ కాలాన్ని విజయవంతంగా అధిగమించవచ్చు. కావున ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి శనివారం నాడు శనీశ్వరుడి దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించిన మీకు సర్వదా శ్రేయస్కరం శుభప్రదం.

Comments