జూన్ 2026: కర్కాటక రాశి వారికి అద్భుతమైన కాలం | Karkataka Rasi June 2026

కర్కాటక రాశి స్త్రీ పురుషులకు జూన్ 2026 లో ఉచ్చ స్థితిలో ఉన్న గురువు మీ జన్మరాశిలోకి ప్రవేశించడం అత్యంత శుభదాయకం గురువు తన తొమ్మిదవ దృష్టితో శనిని చూడడం వల్ల మీ శత్రువులు అలాగే పోటీదారులు సైతం మీకు అనుకూలంగా మారుతారు. లగ్న గురువు మంచి ఆరోగ్యం సంపద శ్రేయస్సు ఆశావాహ దృక్పదాన్ని సూచిస్తుంది. పనులు విజయవంతంగా పూర్తవుతాయి ధనాదాయం బాగుంటుంది. నూతన వ్యక్తుల పరిచయంతో నూతన కార్యక్రమాలు మొదలు పెడతారు. అత్యవసర సమయంలో ఇతరులకు సహాయకారిగా ఉండి బలమైన నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. కెరీర్ వ్యాపార పరంగా చూస్తే జూన్ 20 వరకు 10వ ఇంట స్వక్షేత్రంలో పవర్ఫుల్ గా ఉండే కుజుడు ఆ తరువాత ఏకాదశ లాభస్థానానికి మారడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు వృత్తిలో పురోగతి అలాగే వ్యాపార విస్తరణకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయండి. జూన్ 9న మీ రాశిలోనే గురువు మరియు శుక్రులు కలియక వల్ల రెండు భిన్నమైన సానుకూల శక్తులు అంటే నిదానము వేగము మిమ్మల్ని ఉన్నత మార్గంలో నడిపిస్తాయి. ఆర్థిక పరంగా చూసిన ఈ గ్రహస్థితులు ఆస్తుల కొనుగోలుకు అలాగే లాభదాయకమైన పెట్టుబడులకు ఎంతో అనుకూలమైనవి ముఖ్యంగా ఆస్తులు కొనడానికి మీరు తీవ్రంగా ప్రయత్నిస్తారండి. విద్యపరంగా చూస్తే ఉచ్చ గురువు ప్రభావంతో విద్యార్థుల్లో అద్భుతమైన జ్ఞానము తెలివితేటలు వెల్లివిరుస్తాయి. గురువులనే మించే స్థాయికి మీ ఆలోచన విధానం లాజికల్ థింకింగ్ నైపుణ్యం ఎదుగుతాయి. ప్రేమ కుటుంబం వైవాహిక జీవిత పరంగా చూసిన ఈ మాసం మీ దీర్ఘకాలిక కోరికలను నెరవేరుస్తుంది. జూన్ 9 నుంచి ఏడవ ఇంటిపై పడే గురువు శుక్రుల శుభ దృష్టి వల్ల వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి అనుకూలమైన సంబంధాలు కుదురుతాయి. వివాహం పట్ల సానుకూల నిర్ణయానికి వస్తారు. రెండవ ఇంట కేతువు వల్ల అడపా దడప చిన్నపాటి గందరగోలం ఉన్నప్పటికీ గురువు అండతో కుటుంబ జీవితం చాలా ఆనందంగా సాఫీగా సాగుతుంది. కుటుంబ సభ్యుల అవసరాలు గ్రహించి వాటిని తీరుస్తారు. వాళ్ళతో మరింత సమయం గడుపుతారు. ఆరోగ్యపరంగా చూస్తే గతంలో ఉన్న శారీరక అనారోగ్యాలు బాధలన్నీ పూర్తిగా నయమవుతాయి. అయితే గురువు జన్మరాశిలో ఉన్నందున మీ ఆలోచనలు విపరీతంగా పెరిగి మెదడుపై బుద్ధిపై కొంత మానసిక ఒత్తిడి పడే అవకాశం ఉంది. కావున అతిగా ఆలోచించడం మానుకోవాలి. సో స్పెషల్ అడ్వైస్ ఏమిటంటే ఈ జూన్ మాసం మీ నిజమైన బలాన్ని సామర్థ్యాన్ని ప్రతిభను ప్రపంచానికి నిరూపించుకునే అద్భుతమైన కాలంఅండి. జన్మరాశిలో గురువు వల్ల కలిగే అధిక ఆలోచనలను మానసిక ఒత్తిడిని జయించడానికి క్రమం తప్పకుండా ధ్యానం చేయండి. ప్రశాంతంగా ఉంటూ లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి కావున ప్రతిరోజు కాలభైరవాష్టకం చదవండి గురువారం నాడు గురు దక్షిణామూర్తికి అర్చన అభిషేకం చేపించిన మీకు సర్వదా శ్రేయస్కరం శుభప్రదం

Comments