జూన్ 2026: మిథున రాశి వారికి అత్యంత అద్భుతమైన కాలం | Mithuna Rasi June 2026

మిధున రాశి స్త్రీ పురుషులకు జూన్ 2026 అత్యంత అదృష్టకరమైన అద్భుతమైన మాసంగా చెప్పాలి. మీ రాశ్యాధిపతి బుధుడు అలాగే యోగకారకుడైన శుక్రుడు మీ జన్మరాశిలోనే ఉండటం అలాగే ద్వితీయ స్థానంలో వాక్కు ధనస్థానం గురు భగవానుడు ఉండటం వల్ల గత రెండేళ్లుగా ఉన్న ఆటంకాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఆకస్మికంగా వచ్చే ఆదాయం మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. సత్ప్రవర్తన మంచి మాటతీరు మర్యాద హస్య చతురత కారణంగా అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ముందంజలో ఉంటారు. మంచి వారితో చేసే స్నేహం మీకు మంచి కలిగిస్తుంది. నలుగురి మధ్యలో మీ పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపార రిచ్య చూసిన జూన్ 9న శుక్ర గురువుల కలయక అలాగే జూన్ 23న బుధు గురువుల కలయక వల్ల అద్భుతమైన సూపర్ కాంబో ఏర్పడి వృత్తిలో ఉన్నత పదవులు వ్యాపార విస్తరణ గొప్ప గుర్తింపు లభిస్తాయి. గురు దృష్టి శనిపై పడటం వల్ల మీ శ్రమకు తగిన ఉత్తమ ఫలితాలు అందుతాయి. జూన్ 15న సూర్యుడు మీ రాశిలోకి ప్రవేశించడం మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. సమాచార సాంకేతిక ఐటి రంగంలో రాణిస్తారు. మీడియా సినీ వ్యాపారాలలో అత్యధిక ప్రయోజనకారులు అవుతారు. ఆర్థిక పరంగా ఈ మాసంలో మీరు ఆస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేయడానికి లాభదాయకమైన పెట్టుబడులు పెట్టడానికి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. విద్యపరంగా చూస్తే విద్యార్థులకు ఇది ఊహించని విజయాలను అందించే కాలంఅండి. చదువులో మీరు అనుకున్న ప్రణాళికలు అద్భుతంగా నెరవేరుతాయి.
ప్రేమ కుటుంబం వైవాహిక జీవిత పరంగా చూస్తే ఈ మాసం మీ కలలను సాకారం చేస్తుంది. ద్వితీయ స్థానంలో ఉన్న శుభ గ్రహాల ప్రభావం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వివాహాలకు ఎదురు చూస్తున్న వారికి కుటుంబ సభ్యుల అంగీకారం లభిస్తుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకుంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన ఆత్మీయత బలపడుతుంది. ముఖ్యంగా మహిళలు ఆనందంగా గడుపుతారు. జూన్ 20న కుజుడు 12వ ఇంటికి మారుతున్నప్పటికీ దానివల్ల మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఆరోగ్యపరంగా చూస్తే జన్మరాశి నుంచి గురువు ద్వితీయంలోకి మారడం వల్ల మీపై ఉన్న మానసిక ఒత్తిడి అధిక ఆలోచనలు పూర్తిగా తగ్గిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. సో స్పెషల్ అడ్వైస్ ఏమిటంటే జూన్ మాసం సూర్యుడు మిధునంలో ఉండే సమయం అదృష్ట పవనాలు పూర్తిగా మీ వైపు వీస్తున్నాయి. మీరు ప్రశాంతంగా ఉన్న అవకాశాలు వాటంతటవే మీ తలుపు తడతాయి. కొద్దిగా ప్రయత్నిస్తే మరింత వేగంగా ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. అనుమానాలు అపోహలు వదిలిపెట్టి ఈ అద్భుతమైన కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. కావున ప్రతిరోజు సూర్యాష్టకం పటిస్తూ మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అర్చన అభిషేకం చేపించిన మీకు సర్వదా శ్రేయస్కరం శుభప్రదం.

Comments