జూన్ 2026: వృషభరాశి వారికి లక్ష్మీనారాయణ యోగం | Vrushaba Rasi June 2026

వృషభ రాశి స్త్రీ పురుషులకు జూన్ 2026 అనేక గ్రహాల మార్పులతో విశేషమైన ఫలితాలు లభిస్తాయి. కెరీర్ పరంగా చూస్తే తృతీయంలో ఉన్న గురువు 11వ స్థానంలో శనిని వీక్షించడం ఒక శుభ పరిణామం దీనివల్ల ఇతరులను గౌరవించడం మీ పాత పరిచయాలు స్నేహితులు లేక తోపుట్టువల ద్వారా ఉద్యోగంలో అనుకొని సహాయము పురోగతి లభిస్తాయి. వ్యాపారం మరియు ఆర్థిక విషయాల్లో జూన్ 1 నుంచి 9 వరకు ద్వితీయ స్థానంలో బుధ శుక్రుల కలయక వల్ల ఏర్పడే లక్ష్మీనారాయణ యోగం వల్ల ఆర్థిక నిర్ణయాలకు అద్భుతమైన సమయం అండి. అయితే పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండటం కేవలం కుటుంబ అవసరాలకు మాత్రమే చిన్న పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం. విద్యపరంగా చూస్తే విద్యార్థులకు ఇది అద్భుతమైన మాసం కానీ విదేశీ విద్య లేదా దూర ప్రయాణాలకు సంబంధించిన ప్రణాళికలు అలాగే ఎడ్యుకేషన్ లోన్ల విషయంలో ఆర్థిక నిపుణుల సలహా తీసుకొని అడుగు వేయడం మంచిది. ప్రేమ కుటుంబం వైవాహిక జీవిత పరంగా చూసిన ఈ మాసంలో చాలా ఆశాజనకంగా ఉంటాయండి. సప్తమ స్థానంపై ఉన్న గురు దృష్టి జూన్ 21న వృషభ రాశిలో కలత్రకారకుడైన కుజుడి ప్రవేశం వివాహ ప్రయత్నాలకు అత్యంత అనుకూలం మీరు ప్రేమలో ఉన్నట్లయితే కుటుంబ సభ్యులను ఒప్పించడానికి స్నేహితులు లేదా మూడవ వ్యక్తుల సహాయం మీకు లభిస్తుంది. ఇది వివాహానికి దారి తీస్తుంది. ద్వితీయ స్థానంలో ఎటువంటి అశుభ గ్రహాలు లేకపోవడం వల్ల కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా సాగుతాయి. ఇంట్లో పరిస్థితులు సంతృప్తికరంగానే ఉంటాయి. శుభ కార్యక్రమాల నిమిత్తం దూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి రావచ్చును. మహిళలకు ఈ సమయం శరీర సౌందర్యానికే కాస్మెటిక్స్ మొదలగు వాటికి ధనవ్యయం చేయడం కళాత్మకంగా ఇతరులను ఆకర్షించడం వారి ప్రణాళికలు కోరికలను నెరవేర్చుకునేందుకు చాలా బాగా ఉపకరిస్తుంది.
ఆరోగ్య రిచ్యా చూస్తే జూన్ 20 వరకు 12వ ఇంట ఉన్న కుజుడి దృష్టి నేరుగా సష్టమ స్థానంపై పడటం వల్ల చిన్నపాటి తలనొప్పులు శరీరంలో ఉష్ణ సంబంధిత సమస్యలు లేక మానసిక ఆందోళన వంటివి కలగవచ్చు. అయితే ఇతర గ్రహాలు బలంగా ఉండటం వల్ల పెద్ద అనారోగ్య సమస్యలు రావు స్పెషల్ అడ్వైస్ ఏమిటంటే 12 ఒకటవ ఇంట కుజుడు సో కొన్ని ఆటంకాలు కొంచెం స్తబ్దత ఏర్పడవచ్చు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. కొన్ని అపనిందలు మీపైన వస్తాయి. చికాకు పడకండి ఎటువంటి పరిస్థితుల్లోనూ సహనాన్ని వదలకండి. మూడవ ఇంట ఉన్న గురువు మీకు సమాజంలో మంచి గుర్తింపును ప్రముఖులతో పరిచయాలను తెచ్చిపెడతాడు. అయితే అనవసర వాగ్వాదాలకు అధిక ధనవ్యయానికి ఓవర్ థింకింగ్ కు దూరంగా ఉండి మీ పరిచయాలను మరియు సమయాన్ని పాజిటివ్ గా సద్వినియోగం చేసుకోండి. కావున ప్రతిరోజు సూర్యాష్టకం పటిస్తూ మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అర్చన అభిషేకం చేపించిన మీకు సర్వదా శ్రేయస్కరం శుభప్రదం.

Comments