జూన్ 2026: మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? 🤔 | Mesha Rasi June 2026

మేషరాశి స్త్రీ పురుషులకు జూన్ మాసంలో గ్రహస్థితుల అనుకూలత వల్ల జీవితంలో అద్భుతమైన సానుకూల మార్పులు గోచరిస్తున్నాయి. సుఖస్థానంలో ఉచ్చ గురువు అన్ని విధాల యోగము అది ఎలాగో చూద్దాం. ఆకస్మిక ధనలాభం మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందండి. అప్పులు దాదాపు పూర్తిగా తీర్చేస్తారు. గత రెండు మాసాలుగా మీరు ఎదుర్కుంటున్న సమస్యల నుంచి బయట పడతారు. తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తి కావడంతో అందరి మననలు పొందుతారు. మంచి వ్యక్తులు ఎదురవుతారు వాళ్ళతో పరిచయం పెరుగుతుంది. నూతన గృహ నిర్మాణం చేపడతారు. వృత్తి ఉద్యోగ వ్యాపార మరియు ఆర్థిక రంగాల్లో 12వ స్థానంలో ఉన్న శని వల్ల ఉద్యోగంలో కొంత అనిశ్చితి లేదా ఒత్తిడి ఉన్నప్పటికీ నాలుగవ స్థానంలో కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్న గురువు యొక్క శుభ దృష్టి నేరుగా శనిపై పడటం వల్ల ఆ ప్రతికూలత కాస్త సానుకూలంగా మారుతుంది. దీనివల్ల వృధా ఖర్చులు శుభ వ్యయాలుగా మారి నూతన గృహము లేదా వాహనం కొనుగోలు చేయడానికి ఆస్తుల రినోవేషన్ మరియు ఇతర పెట్టుబడులకు ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుందండి. ప్రస్తుతం మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నదో కామెంట్స్ లో చెప్పండి. విద్యపరంగా చూస్తే తృతీయంలో బుధుడు శుక్రుని కలయక విద్యార్థులకు ఉన్నత స్థానాలకు ఎంపిక అగుటకు అవకాశాలు వస్తాయి. పట్టుదలతో కార్యసిద్ధి కలుగుతుంది. విద్యార్థులకు అపారమైన బుద్ధి బలాన్ని ధైర్యాన్ని ప్రసాదించి వారు అనుకున్న లక్ష్యాలను సునాయాసంగా చేరుకునేలా చేస్తుంది. ప్రేమ కుటుంబం వైవాహిక జీవితంలో ఈ మాసం మీకు ఎంతో ఆనందాన్ని చేకూరుస్తుంది. జూన్ 22న రాశ్యాధిపతి కుజుడు ద్వితీయ స్థానమైన వాక్ స్థానానికి అంటే వృషభానికి మారడం వల్ల కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. విడిపోయిన దంపతులు మళ్ళీ కలుస్తారు అలాగే ఉచ్చ గురువు ఇంట్లో శుభకార్యాలు వివాహ చర్చలకు అద్భుతమైన అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాడు. ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు అప్పులు మానసిక ఒత్తిడి నుంచి బయట పడడానికి గురు దృష్టి మార్గదర్శకత్వాన్ని ఇతరుల నుంచి సహాయాన్ని అందిస్తుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఇదఎంతో ఊరట్నిస్తుంది. అయితే ఒకటి రెండు స్థానాల్లో రాశ్యాధిపతి కుజుని సంచారం కారణంగా ఉష్ణ సంబంధమైన గొంతు, కళ్ళు నరాలకు సంబంధించిన సమస్యలతో పాటు రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉన్నది. కావున స్పెషల్ అడ్వైస్ ఏమిటంటే ఈ మాసంలో దాదాపు అన్ని గ్రహాలు మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నప్పటికీ శని 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇతరులతో విభేదించడం భయం, ఆందోళన, నరపేడా కలుగుతాయి. ప్రయాణ భారం, శారీరక శ్రమ ఒత్తిడి ఉంటాయి. ఏ కొత్త నిర్ణయం తీసుకున్నా పెట్టుబడి పెట్టినా పలుమార్లు ఆలోచించి పెద్దల సలహాతో అడుగు ముందుకు వేయండి. దైవభక్తితో మీరు చేసే ప్రతి ప్రయత్నం ఈ మాసంలో మిమ్మల్ని ఖచ్చితమైన విజయపదంలో నడిపిస్తుంది. కావున ప్రతిరోజు హనుమాన్ చాలీసా పటించాలి. శనివారం నాడు శనీశ్వరుడి దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి వికలాంగులకు మీ స్తోమతకు తగ్గట్లు అన్నదానం చేసిన మీకు సర్వదా శ్రేయస్కరం శుభప్రదం.

Comments