- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
>అందరికీ నమస్కారంఅండి. 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ జూన్ రెండవ తేదీన ఖగోళంలో ఒక మహా అద్భుతం జరగబోతోంది. సాక్షాత్తు దేవగురువు బృహస్పతి ఏకంగా కర్కాటక రాశిలో ఉచ్చ స్థితికి చేరుకోబోతున్నాడు. ఈ మహా గురు గోచారం వల్ల కొన్ని రాశుల వారి తలరాత రాత్రికి రాత్రే మారిపోనుంది. పట్టిందల్లా బంగారమే వాళ్ళ దశ తిరగబోతోంది. మరి ఆ అదృష్ట రాశుల్లో మీ రాశి ఉందా గురుభగవానుడు మీకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. శ్రీ పరాభవనామ సంవత్సరం జూన్ 2న గురువు మిధున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం ఎక్సాల్టెడ్ స్టేట్ అనగా ఇక్కడ గురువు ఉచ్చస్థితి పొందుతాడు. సో తిరిగి ఆయన ఈ ఏడాది అక్టోబర్ 31న సింహ రాశిలోకి ప్రవేశం తిరిగి 2027 జనవరి 25న కర్కాటక రాశిలోకి ప్రవేశం ఆ తరువాత జూన్ 26, 2027 లో సింహ రాశిలోకి ప్రవేశం. ద్వాదశ రాశుల వారికి అలాగే మన ప్రపంచంలో జరగబోయే ముఖ్య సంఘటనలకు గురువు కారకత్వం వహిస్తాడు. సో ఈ వీడియోలో మీ రాశికి గురువు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అనేది సూటిగా కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా చెప్పబోతున్నాను. అలాగే వీడియో చివర్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ముఖ్య విషయాలు చెబుతాను. కావున వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.
మేషరాశి స్త్రీ పురుషులకు 2026 జూన్ 2డవ తేదీన సంభవించే గురుగోచారం మేషరాశి వారికి సుఖస్థానం అని పిలవబడే నాలుగవ స్థానంలో జరుగుతుంది. గురువు మీ తొమ్మిదవ 12వ ఇంటికి అధిపతి ఈ గురువు మార్పు అనేది ఖచ్చితంగా మీ జీవితంలో సంతోషాన్ని తీసుకువస్తుంది. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి YouTube లో కనిపించే ఏఐ స్క్రిప్ట్ అలాగే వ్యూస్ కోసం ఫేక్ కంచనాల్లా కాకుండా ఇది మీ రాశికి సంబంధించిన నూటికి 100 శాతం ఖచ్చితమైన గ్రహ సంచార విశ్లేషణ సో నేనేమి చెప్పినా నిజమే చెబుతాను అని గుర్తుపెట్టుకోగలరు. ఇప్పటివరకు మీ రాశికి మూడవ స్థానంలో ఉన్న గురుభగవానుడు ఇకపై మీ రాశికి నాలుగవ స్థానానికి వస్తుండటం వలన మీ జీవితంలో అతి పెద్ద మార్పులు రాబోతున్నాయి. ఒకవైపు ఏలినాటి శని మరొకవైపు గురువు తృతీయ స్థానంలో ఉండటం వలన మీరు జీవితంలో అనేక విధాలైన కష్టాలను అనుభవించి ఉంటారు కాదు అంటారా అవును అయితే కామెంట్స్ లో చెప్పండి ఆ కష్టాల నుంచి మిమ్మల్ని గట్టెక్కించడానికే ప్రస్తుతం గురుభగవానుడు చతుర్థ స్థానానికి వచ్చాడు భగవంతుని దయతో మీ ప్రయత్నం వలన ఆటంకాలు కూడా విజయాలుగా మారుతాయి జీవితంలో మీరు ఒక మంచి స్థాయికి చేరుకోబు తున్నారు చాలా కాలంగా ఉద్యోగం దొరకని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆల్రెడీ ఉద్యోగంలో ఉండి ఉద్యోగం పోగొట్టుకున్న వారికి మీకు తగిన మంచి ఉద్యోగం అనేది లభిస్తుంది. భగవంతుని దయతో మీ జీవితంలో ఎన్నో మంచి విషయాలు జరుగుతాయి. గురువు యొక్క అనుగ్రహం వలన మీ చింతలన్నీ తొలగిపోతాయి. గురువు చతుర్ద పంచమ స్థానాలలో సంచరిస్తున్న ఫలితంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభ పరిణామాలు ఉంటాయి. లక్ష్య సాధనలో సన్నిహితుల సహకారం అందుకుంటారు. మీకు మీ పూర్వీకుల ఆస్తి లభించడం లేకుంటే మీ పాత ఇల్లు లేక పూర్వీకుల నివాసాన్ని సందర్శించే అవకాశం లభిస్తుంది. మీకు కుటుంబ సభ్యుల సాంగత్యం దొరుకుతుంది. మనసులో ఒక ఆనందం ఉంటుంది. సుఖాలు వనరులు పెరుగుతాయి.
మీకు మీ తల్లి ప్రేమ దొరుకుతుంది అలాగే మీ ప్రియమైన వారితో సాన్నిహిత్యం అనేది బలపడుతుంది. ఇంట్లో అనేక మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. దీని కారణంగా అతిథులు ఇంటికి వస్తారు. సంతాన ప్రాప్తి కూడా కలదు మీకు విదేశీ మూలాల నుంచి ధనం అందుతుంది. మీరు ఇంతకుముందే పెట్టుబడులు పెట్టి ఉంటే ఈ కాలంలో మంచి ఆర్థిక లాభాల రూపంలో మీరు ఆ పెట్టుబడుల ప్రతిఫలాన్ని పొందుతారు. మీ మనసు ధార్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది. కార్యాలయంలో అంటే ఆఫీసలో పని చేసే చోట మీకు మంచి విజయాలు లభిస్తాయి. మీ తెలివి తేటలు అనుభవం ఆధారంగా ఆఫీస్ లో మీ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగలుగుతారు. విదేశాలకు వెళ్ళిన వారికి ఈ సమయంలో ఇంటికి అంటే స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం అనేది లభిస్తుందండి. మీ న్యాయమైన ఖర్చులు కొన్ని పెరుగుతాయి. ఇవి సత్కార్యాల కోసం అంటే మంచి పనుల కోసం ఖర్చు చేయబడతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మనసులో ఉత్సాహం ఉప్పొంగుతుంది. మీ రాశికి నాలుగవ ఇంటికి గురుభగవానుడు రావడం వలన మీ ఆరోగ్యం చాలా బాగుంటుందండి. తల్లి వైపు నుంచి లాభం చేకూరుతుంది. ఇల్లు వాహన యోగము కలుగుతుంది. విద్యార్థులు చదువులో విశేష విజయాలు సాధిస్తారు. ఇక తీరవు అని భావించిన జటిలమైన సమస్యలకు సైతం పరిష్కారం అనేది ఈ కాలంలో లభిస్తుంది. దీనివల్ల మీ మనసు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుందండి. భార్యా భర్తల మధ్యన గతంలో ఉన్న మనస్పర్ధలు సంపూర్ణంగా తొలగిపోతాయి. ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకుంటారు చాలా సంతోషంగా ఉంటారు. వ్యయంలో శని భగవానుని వలన పనిభారం అధికంగా ఉండవచ్చు అయినప్పటికీ ఈ గురు గోచారం వలన మీరు వాటన్నిటిని జయించి విజయం సాధిస్తారు. చెడు స్నేహాల వలన ఏర్పడిన చెడు అలవాట్ల నుంచి మీ పిల్లలను బయట పడేస్తారు. వారి కోరికలను కూడా అడిగి తెలుసుకొని వాటిని నెరవేరుస్తారు. వివాహము సీమంతము చెవులు కుట్టించడం లాంటి శుభ కార్యక్రమాల ఖర్చులు అనేవి ఒక రకంగా పెరుగుతాయి.
చిన్న వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు వస్తాయి. సరైన సమయానికి ఆశించిన సహాయం అందుతుంది. కొందరికి ఉద్యోగ మార్పు జరుగుతుంది. అప్పుడప్పుడు నూతన బాధ్యతల వలన పనిభారం మానసిక ఆందోళన ఏర్పడి తిరిగి తొలగిపోతాయి. కొందరికి ఇల్లు బండి వాహనాలకు సంబంధించిన ఖర్చులు రావచ్చును పాత స్థలాన్ని మంచి ధరకు అమ్మి నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక ఆసక్తి అనేది మీలో అధికమవుతుంది. దేవాలయాల పునరుద్ధరణకు సహాయం చేస్తారు. మీలో ఎవరైతే బంగారాన్ని తాకట్టు పెట్టడం అంటే కొదవ పెట్టి ఉంటారో ఆ ఆభరణాలను ఇప్పుడు విడిపించుకుంటారండి. ఆరోగ్యంలో పెద్దగా సమస్యలు లేకపోయినప్పటికీ అప్పుడప్పుడు మనసులో అనవసరమైన ఆందోళనలు వచ్చిపోతుంటాయి. ఇది వ్యయంలో శని వలన కలిగే మార్పులు కానీ గురువు వలన ఇవి అన్ని సాల్వ్ అయిపోతాయి.
వృత్తి మరియు ఉద్యోగ పరంగా చూస్తే గురువు తన సప్తమ దృష్టితో మీ వృత్తి స్థానమైన రాశికి 10వ స్థానం మకర రాశిని చూస్తున్నాడు. దీని మూలంగా కొందరికి కోరుకున్న ప్రదేశానికి లేదా సొంత ఊరికి బదిలీలు అంటే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ సలహాలకు విశేషమైన విలువ అనేది పెరుగుతుందండి. నూతన బాధ్యతలు అంటే కొత్త బాధ్యతలు మిమ్మల్ని ఎతుక్కుంటూ వస్తాయి. వ్యాపార రిచ్యా చూసిన రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వ్యవసాయం విద్యా సంస్థలను నడిపే వారికి ఈ ఉచ్చ గురువు అద్భుతమైన మంచి లాభాలను ఇస్తాడు. మందుల వ్యాపారం మెడిసిన్స్ కమిషన్ ఏజెంట్లు కలప పని డిపార్ట్మెంటల్ స్టోర్స్, వ్యవసాయం, పూల వ్యాపారం ఫ్యాన్సీ స్టోర్స్ ఎవరైతే నడుపుతుంటారో వారందరికీ ఇప్పుడు మంచి లాభాలు వస్తాయండి. స్టేషనరీ రవాణ పాఠశాలలు మార్కెటింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరం విదేశీ ప్రయాణాలకు అనుకూలం ఉద్యోగ వ్యాపారాల్లో చిన్నపాటి మార్పులు చేస్తారు. పెద్దల ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది. స్థిరాస్తులను సమకూర్చుకుంటారు. ఉద్యోగం చేస్తూ ఉన్నత చదువులు చదివేందుకు కూడా ఈ గురువు చాలా అనుకూలిస్తాడు. కొంత ఖర్చులు పెరుగుతాయి అయితే రుణ బాధలు తగ్గిపోతాయి.
ఆర్థిక రిచ్చా చూసిన మీ ఆర్థిక పరిస్థితి అలాగే ఆస్తుల వృద్ధి అనేది ఈ నాలుగవ స్థానం అనేది వాహనము భూమి సుఖభోగాలను సూచిస్తుంది. గురువు ఇక్కడ ఉచ్చ స్థితిని పొందడం వలన సొంత ఇల్లు కొనుగోలు చేయాలనే మీ దీర్ఘకాలిక కల అనేది నెరవేరుతుందండి. పాత ఇంటిని పునరుద్ధరించడం అంటే రెనోవేట్ చేయడం లేదా మరింత సౌకర్యవంతమైన పెద్ద ఇంటికి మారడం లాంటివయతే జరుగుతాయి. కొత్తగా ఆధునిక రకం గల వాహనాన్ని అంటే ఎస్యువి లగ్జరీ వాహనాన్ని కొనుగోలు చేసే యోగం కూడా కలుగుతుంది. మీ ఆదాయం అనేది నిలకడగా ఉంటుంది అదే సమయంలో ఆస్తుల కొనుగోలు కోసం పెద్ద మొత్తంలో మీరు పెట్టుబడులు పెడతారు. ఇకపోతే శుభ వ్యయ రిత్య చూస్తే అంటే వ్యయపరంగా గురువు తన తొమ్మిదవ దృష్టితో రాశికి 12వ స్థానమైన మీన రాశిని చూడటం వలన డబ్బును పొదుపు చేయలేక శుభ కార్యక్రమాల రిచ్చ ఖర్చు చేస్తారు అంటే ఇవన్నీ శుభమూలక వ్యయాల కిందకు వస్తాయండి ఆధ్యాత్మికంగా చేసే ప్రయాణాలు గాని పుణ్యనది స్నానాలు పుణ్యక్షేత్రాలు సందర్శించడం అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాలు పెళ్లి చేయడం వంటి వాటికి మీరు మీరు ఖర్చు చేస్తారు. కుటుంబం మరియు ఆరోగ్య రిచ్చ చూస్తే మీ తల్లిగారి ఆరోగ్యంలో గతం కంటే మంచి మెరుగుదల అనేది కనిపిస్తుంది. ఆమె అనారోగ్యం ఏదైనా ఉంటే అది ఈ కాలంలో వెళ్ళిపోయి ఆమె ఆరోగ్యం బాగా కుదుటపడుతుందండి. మీకు కొత్త ఆస్తులు సమకూరుతాయి లేదా ఆర్థిక సహాయం అనేది లభిస్తుంది. ఈ నాలుగవ స్థానంలో గురువు సంచరించేటప్పుడు సాధారణంగా కొంత శ్రమ పనిభారం ఉంటాయి. దీనివల్ల అప్పుడప్పుడు మానసిక ఒత్తిడి స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది కాబట్టి మీరు ధ్యానం చేయడం చాలా మంచిది.
గురుభగవానుడు తన ఐదవ దృష్టితో మేషరాశికి ఎనిమిదవ స్థానమైన వృశ్చిక రాశిని చూడటం వలన మీకు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వాటి నుంచి ఈ కాలంలో మీకు విముక్తి అనేది తప్పక లభిస్తుంది అలాగే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఏమైనా రావాల్సి ఉంటే పాత బకాయల ద్వారా చేతికి ఈ కాలంలో ధన సహాయం అయితే ఖచ్చితంగా అందుతుందండి. ఇకపోతే గురు దృష్టి ఫలితాలు చూసిన మీ రాశికి నాలుగవ స్థానంలో గురువు ఉండి మీ రాశికి 8 10 12వ స్థానాలని గురు భగవానుడు వీక్షిస్తున్నాడు. సో ఇక్కడ మీ రాశికి ఎనిమిదవ ఇంటిని గురువు చూడటం వలన మీ గత సమస్యలు మీ చింతలు బాధలన్నీ తీరిపోతాయి. బంధువులతో ఇప్పటివరకు ఉన్న విరోధం అనేది తొలగిపోతుంది. విడిపోయిన బంధువులు తిరిగి కలుసుకుంటారు కొందరికి రాకుండా ఆగిపోయిన ఇన్సూరెన్స్ డబ్బు అనేది చేతికి అందుతుంది అలాగే పాత మొండి బకాయలు వసూలవుతాయి. మనసు ఎంతో సంతోషంగా ఆనందంతో నిండి ఉంటుంది. మీ రాశికి 10వ స్థానాన్ని గురువు చూడటం వలన చాలా కాలంగా సంతాన భాగ్యం లేని వారికి సంతాన ప్రాప్తి అనేది తప్పక కలుగుతుంది. అలాగే ఉద్యోగంలో మీ ప్రతిభ ప్రొఫెషనలిజం బయటపడుతుంది. కర్మస్థానం పై గురు దృష్టి పడటం వలన మీ పేరు ప్రఖ్యాతలు అనేవి చక్కగా బాగా ఫేమ్ అవుతాయి. మీ రాశికి 12వ స్థానాన్ని గురువు చూడటం వలన కొందరు ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళతారు భార్యా భర్తల మధ్యన ఇంతకాలం ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోయి వారి మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నవారు సైతం ఈ కాలంలో కోలుకొని ఇంటికి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారండి.
ఇకపోతే నక్షత్రాల వారిగా ఫలితాలను చూస్తే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి కేతువు ఆధిపత్యం కలిగిన మీకు ఈ గురుగోచారం నెలకడైన వృద్ధిని ఇస్తుందండి ఆఫీసలో కొత్త బాధ్యతలు పెరుగుతాయి కొందరికి ఉద్యోగ బదిలీ జరగవచ్చు అది ప్రారంభంలో కష్టంగా అనిపించినప్పటికీ భవిష్యత్తులో చాలా బాగా మంచిగా మారుతుంది. భూమికి సంబంధించిన లాభాలు కలుగుతాయి. ఇల్లు కట్టడం లేదా స్థలం కొనడం లాంటి ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది. మీ పేరు కీర్తి ప్రతిష్టలకు ఎలాంటి మచ్చ రాకుండా కొంత జాగ్రత్త పడాలి. అనవసరమైన వాదనలను మానుకోవడం మంచిది. మీరు మంగళవారాల్లో వినాయకుడిని గరికమాలను సమర్పించి పూజ చేసిన చాలా మంచిదండి భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి చూస్తే శుక్రుని ఆధిపత్యం కలిగిన మీకు ఈ ఉచ్చ గురువు మార్పు అనేక శుఖభోగాలను ఇస్తాడు నూతన వాహనం కొనుగోలు చేసే యోగం చాలా బలంగా ఉంటుంది. మీ ఇంటిని ఆధునికరిస్తారు విలాసవంతమైన వస్తువులు సమకూరుతాయి. తల్లిగారితో ఉన్న అభిప్రాయ భేదాలు తొలగిపోయి సాన్నిహిత్యం అనేది పెరుగుతుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు అనుకున్న ప్రణాళిక ప్రకారం జరుగుతాయి. పనిలో శ్రమ ఉన్నప్పటికీ దానికి తగిన మంచి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. బయట ప్రాంతాలకు చేసే ప్రయాణాల వలన అధిక లాభాలు చేకూరుతాయి. మీరు ఏం చేయాలంటే శుక్రవారం నాడు అమ్మవారికి అంటే మహాలక్ష్మి అమ్మకి నెయ్యి దీపం వెలిగించి లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల మీరు ఎంతో విశేషంగా ఈ గురువు వల్ల లాభపడతారండి.
కృతికా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారికి చూస్తే సూర్యుని ఆధిపత్యం కలిగిన మీకు అధికారంతో పాటు గౌరవ మర్యాదలు పెరిగే కాలం ఇది. ఈ గురువు వల్ల మీకు ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి అంటే ప్రమోషన్ అలాగే జీతంలో పెరుగుదల మంచి ఎంకరేజ్మెంట్ లభించే అవకాశం ఉంది. రాజకీయాలు ప్రజా జీవితంలో ఉన్నవారికి మీ పలుకుబడి అమాంతం పెరుగుతుంది. తండ్రి వైపు బంధువుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు ఎలాంటి ఆటంకం లేకుండా అందుతాయి. పూర్వీకుల ఆస్తి సమస్యల్లో సానుకూల పరిష్కారం అనేది లభిస్తుందండి. ఆరోగ్యంలో చిన్నపాటి ఇబ్బందులు వచ్చి వచ్చిపోతుంటాయి. క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు పాటించడం ఎంతో అవసరం మీరేం చేయాలంటే ఆదివారాల్లో సూర్య భగవానుని ఆదిత్య హృదయం చదువుతూ లేకుంటే కుదరకపోతే వింటూ ఆరాధించడం వలన మీకు మనోధైర్యం లభిస్తుంది. ఆటంకాలు తొలగి విజయాలు సిద్ధిస్తాయి.
ఇకపోతే ఈ ఏడాది డిసెంబర్ 13 నుంచి 2027 ఏప్రిల్ 13 వరకు గురువు వక్రగమనంలో ఉన్న కాలంలో అంటే ఆ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంతమందికి నిరుత్సాహం అనేది ఉంటుందండి ఉద్యోగ యత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ టైంలో ప్రయాణాల్లో నిదనం పాటించాలి వాగ్వాదాలకు దూరంగా ఉండాలి ముఖ్యంగా ఆడిటింగ్ క్రీడలు సినిమా టెలివిజన్ రంగాల వారు మీ లక్ష్య సాధన కోసం అధికంగా శ్రమించాలి. ఈ రాశి విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధ చూపాలి. అయితే మీ కుటుంబంలో మీరే ఉత్తములని భావించే తప్పు చేయకండి అలాగే అందరి మద్దతు పొందడానికి అందరితో కలిసి మెలిసి అన్యోన్యంగా జీవించండి. ఈ టైంలో మీరు సిద్ధంగా ఉన్న రెడీమేడ్ ఇంటిని కొనుగోలు చేసే అవకాశం అయితే లభిస్తుందండి. ఇకపోతే ఆఫీస్ లో పని చేసే వారి విషయానికి వస్తే మీ ఉద్యోగంపై ఈ కాలంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తత ఎంతైనా అవసరం. వ్యాపారుల విషయానికి వస్తే పోటీ మరియు అసూయలను అధిగమించి వ్యాపారంలో కొంతమేర అభివృద్ధి ఉంటుంది. కానీ ఇతరులను నమ్మి మీరు పెద్ద బాధ్యతలను అప్పగించవద్దు. సో మీ రాశికి నాలుగవ స్థానమైన కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థితిని పొందడం అంటే ఆస్తులు సమకూర్చుకోవడానికి ఈ గురు మార్పు అనేది చాలా అనుకూలమైనది. అయితే నాలుగవ స్థానం శ్రమను సూచిస్తుంది కాబట్టి మీరు ఏదైనా ప్లానింగ్ పనులు చేసేటట్టుగా ఉంటే ఒకటికి రెండు సార్లు చక్కగా ప్లాన్ చేసుకొని ఒక ప్రణాళిక వేసుకొని వ్యవహరించడం వలన విజయం అనేది సులభతరం అవుతుంది.
ఆగండి ఆగండి ఇక్కడితో అయిపోలేదు అసలైన వీడియో ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతోంది. అది చూసి చివరిలో మీరు చేయాల్సిన పరిహారము తెలుసుకోగలరు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రయాణాలు అలాగే పెట్టుబడులపై కొన్ని ముఖ్యమైన సూచనలు గురుగోచారం ఈ ఉగాది సంవత్సర ప్రారంభంలో ప్రయాణ ప్రణాళికలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి కాలసర్పయోగం సంపూర్ణ వివరణ అనే వీడియోలో చెప్పడం జరిగింది. మీలో ఎంతమంది చూశారో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఈ వీడియోలో అప్డేట్ చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందండి. విద్య ఉద్యోగం వ్యాపార రిత్యా చూసిన మీరు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణం చేయబోతున్నట్లయితే కొంచెం ఆలోచించి సరైన ప్రణాళికతో ముందడుగు వేయండి. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటే జాగ్రత్త అవసరం. ఉద్యోగం ఉంటేనే డబ్బు సంపాదించి కుటుంబాన్ని స్థిరపరచడానికి కదా మనం వలస వెళ్లేది. కాబట్టి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏ దేశం నుంచి ఏ దేశానికి వలస వెళ్ళినా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మీ వ్యక్తిగత జాతకంలో మంచి దశాభుక్తి నడుస్తుంటే మీ రాశి ఫలాలు బాగుండి పాజిటివ్ గా ఉంటే ఎటువంటి భయము అవసరం లేదు ఎక్కడికి వెళ్ళినా మీకు విజయం దక్కుతుంది. మీ వ్యక్తిగత జాతకంలో ఏదైనా ప్రతికూలత ఉంటే దశాభుక్తి సరిగా లేకపోతే రాహు దశ లేక శని దశ నడుస్తుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయండి. తొందరపడి ధనం పెట్టుబడిగా పెట్టి ఇరుక్కోకండి.
విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవాలని ఉదాహరణకు యుఎస్ యూకే ఆస్ట్రేలియా తదితర దేశాలకు ప్రయాణం చేస్తుంటే నా ముఖ్యమైన సలహా ఏమిటంటే ఈసారి గురు గోచారం ఎలా జరిగిందంటే గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు ఇది బలమైన స్థానం కాదని నేను చెప్పను కానీ ఈ గురువుకి తర్వాత స్థానంలో కేతువు అనే గ్రహం ఉన్నాడు కేతువు అంటే ఎప్పుడు మార్పు ట్రాన్స్ఫర్మేషన్ లేదా ఒకదానిని నాశనం చేసి మరొకటి సృష్టించడం ఇక్కడ గురువుకి దగ్గర అవుతున్న కేతువు వల్ల త్వరలో గురు కేతువుల కలయక జరగబోతోంది. కాబట్టి నా అభిప్రాయం ఏమిటంటే జూన్ 2026 లో లేదా ఈ సంవత్సరం మొత్తం మీ చదువు కోసం ప్రయాణం చేయబోతుంటే అనేకసార్లు ఆలోచించండి. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నట్లయితే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ వ్యక్తిగత జాతకం బాగుందో లేదో సరి చూసుకోండి. ఇది ఎవరిని నిరుత్సాహ పరచడానికి నేను చెప్పడం లేదు. చాలా మంది నెగ్లెక్ట్ చేసి నిర్లక్ష్యంగా ప్రయాణం చేసి అక్కడ స్థిరపడలేక వెనక్కి వచ్చి ఆ తరువాత లోన్ కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. పెట్టుబడుల విషయంలో మీరు కొంత డబ్బు దాచుకొని హోమ్ లోన్ కు వెళ్ళాలనో కొంచెం బంగారం కొనాలనో లేదా షేర్ మార్కెట్ లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనో అనుకుంటే కొంచెం ఓపికగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే సాధారణంగా పెట్టుబడులు పెట్టడానికి ఇదంత సరైన సమయం కాదు మీ వ్యక్తిగత జాతకం బాగుంటే పర్లేదండి పెట్టుబడులు అలాగే ఆర్థిక వృద్ధికి గురువే ప్రధాన కారకుడు ఉచ్చ స్థితిలో ఉన్న గురువు పక్కనే కేతువు ఉండటం వల్ల ఆదాయం ఎలా వస్తుందో పెట్టుబడులు సరైన ట్రాక్ లో వెళ్తాయో లేదో ఖచ్చితంగా చెప్పలేం కాబట్టి ఆలోచించి అడుగు అనేది ముందుకు వేయండి. ఇదంతా ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదు అంటే ఇవన్నీ నేను కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే చెబుతున్నాను.
మీరు వ్యక్తిగతంగా ఆర్థికంగా చాలా బలంగా ఉండి మీ మనీ ఫ్లో అద్భుతంగా ఉంటే వ్యాపారం చాలా బాగా సాగుతుంటే మీరు నిరభ్యంతరంగా మీ ప్లాన్స్ మీరు చేసుకోవచ్చండి. కానీ బడ్జెట్ వేసుకునే ప్రణాళిక ప్రకారం జీవితాన్ని గడిపేవారు ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాల వారు మాత్రం కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలనేది నా సలహా. దయచేసి ఈ వీడియోని మీ స్నేహితులు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి ఉద్యోగం పెట్టుబడి ప్రాపర్టీ లేదా కనీసం వాహనం కొనే ప్లాన్ అయినా ఉంటుంది. ఏదేమైనప్పటికీ భార్యగా ధనాన్ని పెట్టుబడిగా పెట్టి లాక్ చేయవద్దు. పెద్ద పెద్ద లోన్లు తీసుకోకుండా సేఫ్ జోన్ లో ఉండటం మంచిదని మాత్రమే నా అభిప్రాయం. అలాగే కాలసర్ప దోష ప్రభావం దీని గురించి నేను ఇప్పటికే చెప్పాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యల్లో రాహు కేతువుల మధ్య అన్ని గ్రహాలు ఉండటం వల్ల జూలై వరకు కాలసర్ప దోష ప్రభావం ఉంటుందండి. జూలై వరకు కొంచెం గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆ తరువాత ఆగస్టు మాసంలో 17వ తేదీన సూర్యుడు తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశించాక లోక కాలమాన పరిస్థితుల్లో మార్పులు అనేవి చూడవచ్చును.
కాబట్టి దేనికి ఓపిక కోల్పోకుండా మీ కనీస అవసరాలు ఏమిటో వాటికి మాత్రమే ప్లాన్ చేసుకోండి. అంతేకానీ పరిమితికి మించి అడుగులు వేయడం లేదా పెద్ద మొత్తంలో రిస్కులు తీసుకునే విషయాలకి దూరంగా ఉండటం మంచిదన్నది నా సంపూర్ణ అభిప్రాయం. మేషరాశి వారికి చక్కటి సులభమైన పరిహారాలు గనుక చూస్తే గురువారాల్లో దక్షిణామూర్తికి పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించి పూజించడం చాలా మంచిది. పేద విద్యార్థుల విద్య అవసరాలకు సహాయం చేయడం వలన గురుభగవానుని అనుగ్రహం మీకు రెట్టింపు అవుతుందండి మీ జన్మ నక్షత్రం రోజున గురు భగవానుని వెళ్లి దర్శించుకొని పూజించండి అంటే గురు దక్షిణామూర్తిని అర్చన అభిషేకం చేపిస్తే దీనివల్ల మీకు ఆర్థిక పరంగా వచ్చే సమస్యలు తీరిపోతాయి ఏమైనా ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి. కాకులు పక్షులు కుక్కలు గోవులకు నీరు ఆహారాన్ని అందించండి లేని వారికి పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి ఇందువల్ల పుణ్యము సత్కర్మలు అనేవి మీకు తప్పక సంప్రాప్తిస్తాయి. ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును శుభం సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లైతే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్

Comments
Post a Comment